సూపర్ స్టార్ కృష్ణ భార్య విజయనిర్మల కన్నుమూత

సూపర్ స్టార్ కృష్ణ భార్య విజయనిర్మల కన్నుమూత

 నాటి హీరోయిన్, భారత దేశంలో తొలితరం మహిళా దర్శకురాళ్లలో ఒకరయిన సూపర్  స్టార్ కృష్ణ భార్య విజయనిర్మల (73) ఇక లేరు.  హైదరాబాద్ కాంటినెంటల్ హాస్పిటల్స్ లో తుది శ్వాస విడిచారు.

విజయనిర్మల  నటి దర్శకురాలు మరియు నిర్మాతగా ఎంతో పేరు సంపాదించారు.ఏడవ యేటనే ఆమె సినిమాల్లో నటించారు.1950లో ఆమె మచ్చ రేఖ అనే తమిళ సినిమాలో నటించారు ,1957లో తెలుగు పాండురంగ మహాత్యం లో ఆమె బాలకృష్ణుడిగా నటించారు.

ఆమె 200సినిమాలలో నటించారు. ఏడవ యేటనే ఆమె సనిమాల్లో నటించారు.1950లో ఆమె మచ్చ రేఖ అనే తమిళ సినిమాలో నటించారు ,1957లో తెలుగు పాండురంగ మహాత్యం లో ఆమె బాలకృష్ణుడిగా నటించారు. మొత్తం ఆమె 25 మలయాళం, 25 తమిళ చిత్రాలలో నటించారు.

44 తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించింది. ఇందుకుగాను ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా చోటు సంపాదించింది. ఆమె తీసిన చిత్రాలలోె మీనా కు చాలా మంచి పేరొచ్చింది.మహిళల సంఘర్షణను ఆమె గొప్పగా చిత్రీకరించే వారు.

2008 సంవత్సరంలో  తెలుగు సినిమా పరిశ్రమ కి ఆమె అందించిన సేవలకు గాను ప్రతిష్టాత్మకమైన రఘుపతి వెంకయ్య అవార్డు కూడా తన సొంతమైంది.

తమిళ లెజెండ్ శివాజీ గణేషన్ సినిమాలకి దర్శకత్వం వహించిన రెండో మహిళ విజయనిర్మల కావడం విశేషం. ఆమె  కంటే ముందు మహానటి సావిత్రి దర్శకత్వంలో శివాజీ గణేషన్ గారు నటించి ఉన్నారు.

విజయనిర్మల తమిళనాడు లో పుట్టారు. ఆమె తండ్రి సినిమా  ప్రొడక్షన్ విభాగంలో పనిచేసే వారు. విజయనిర్మల  మొదటగా కృష్ణమూర్తి అనే ఇంజనీర్ ని వివాహమాడారు వీరికి కలిగిన సంతానం ప్రముఖ తెలుగు నటుడు నరేష్. కృష్ణమూర్తితో విడిపోయాక తర్వాత ఆమె సూపర్ స్టార్ కృష్ణ ని వివాహమాడారు.

విజయనిర్మల మరణం తెలుగు సినిమా పరిశ్రమ కి తీరని లోటు. ఆమె కుటుంబ సభ్యులకి తెలుగు రాజ్యం తరఫున మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం అలాగే ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.