మహేష్‌ని ఇరికించేసిన పవిత్ర నరేష్.!

పవిత్ర లోకేష్ కాదు.. పవిత్ర నరేష్.! పవిత్ర మెడలో నరేష్ తాళి కట్టకపోయినా, ఆ ఇద్దరూ ఆలుమగలే.! మనసులు కలిశాయ్.. తాళి కడితే ఏంటి.? కట్టకపోతే ఏంటి.? అంటున్నాడు మరి నరేష్.!

అబ్బో, ఈ ముదురు ప్రేమని అస్సలు భరించలేకపోతున్నారు సినీ జనాలు.! ఇంటర్వ్యూల్లో, ప్రెస్ మీట్లలో ఇరువురూ మాట్లాడుతున్న మాటలు రోత పుట్టిస్తున్నాయనడం అతిశయోక్తి కాదేమో. సరే, అది ఆ ఇద్దరి వ్యక్తిగత వ్యవహారం.. అని సరిపెట్టుకోవాల్సిందే.

అయితే, ఈ వ్యవహారంలోకి మహేష్ పేరుని లాగేస్తున్నారు ఇద్దరూ. తమకు మహేష్ నుంచి యాక్సెప్టెన్స్ లభించిందన్నట్టు నరేష్, పవిత్ర మాట్లాడుతున్నారు.

‘మహేష్ అభిమానులు నన్ను ఆదరిస్తున్నారు, అక్కున చేర్చుకున్నారు’ అని అంటోంది పవిత్ర. ఈ వ్యవహారంపై మహేష్ అభిమానులు తెగ బాధపడిపోతున్నారు. మహేష్ సైతం, ఈ తీరు పట్ల అసహనంతో వున్నాడట. మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణకి రెండో భార్య విజయ నిర్మల. ఆ విజయనిర్మల మొదటి భర్త కొడుకు నరేష్.!