అఫీషియల్ : నీహారిక కోసం విజయ్ దేవరకొండ

రౌడీ స్టార్ కి చీవాట్లు.. అంత త‌ప్పేం చేశాడ‌ని?

ఇవాళ తెలుగులో మోస్ట్ హ్యాపినింగ్ హీరో ఎవరూ అంటే విజయ్ దేవరకొండ. ఆయన ఏదైనా సినిమా ఫంక్షన్ కు వస్తున్నాడంటే ఫ్యాన్స్ ఓ రేంజిలో అక్కడ రచ్చ రచ్చ చేసేస్తారు. సినిమావాళ్లకు కావాల్సింది అదే. అందుకేనేమో నీహారిక కొణిదెల తన తాజా చిత్రం ‘సూర్యకాంతం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిధిగా విచ్చేయనున్నాడు విజయ్ దేవరకొండ. ఈ నెల 23వ తేదీ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని జెఆర్‌సి కన్వెన్షన్‌లో జరగబోయే ఈ వేడుకలో ‘సూర్యకాంతం’ యూనిట్‌తో పాటు విజయ్ దేవరకొండ సందడి చేయనున్నాడు.

నిర్వాణ సినిమాస్ బ్యానర్‌పై వరుణ్ తేజ్ సమర్పణలో ‘సూర్యకాంతం’ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంతో యువ దర్శకుడు ప్రణీత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చిత్రంలో కొణిదెల నిహారిక, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మార్క్ రాబిన్ సంగీతం అందిస్తున్నారు. చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ప్రోమోస్ ప్రేక్షకుల్లో ఆసక్తిని నింపాయి. చిత్రాన్ని ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇగో అండ్ డామినేషన్ ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. నిహారిక సినిమాకు విజయ్ చీఫ్ గెస్ట్ గా హాజరవుతుండంతో అంచనాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో, నీహారికకు ఏ స్దాయి హిట్ ఇస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.