‘సర్కార్’ తెలుగు వెర్షన్ కలెక్షన్స్ పరిస్దితి ఏంటి?

తమిళ స్టార్ హీరో విజయ్,ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ‘సర్కార్’. దీపావళి కానుకగా రిలీజైన ఈ చిత్రం తమిళ వెర్షన్ వివాదాలతో బ్లాక్ బస్టర్ దిసగా దూసుకుపోతోంది. చెన్నైలోనే కాకుండా తమిళనాడు అంతగా ఈ చిత్రం వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. వివాదాలు చుట్టముట్టినప్పటికి వచ్చినప్పటికీ.. అవేవి ఈ సినిమాపై ప్రభావాన్ని చూపెట్టలేకపోతున్నాయి.

తెలుగు వెర్షన్ కు మాత్రం మొదటి రోజే డివైడ్ టాక్ వచ్చింది. ఈ నేపధ్యంలో తెలుగు వెర్షన్ కలెక్షన్స్ పరిస్దితి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకు పోటీగా విడుదలైన అదిగో, ధగ్స్ ఆఫ్ హిందూస్దాన్ చిత్రాలు భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావటం ఈ సినిమాకు కలిసి వచ్చింది. సినిమాకు ఉన్న భారీతనం, దర్శకుడుగా మురుగదాస్ కు తెలుగునాట ఉన్న పాపులరిటీ కూడా జనాలను పుల్ చేసేందుకు పనికొస్తోంది. ఈ వీకెండ్స్ చాలా చోట్ల హౌస్ ఫుల్స్ కనపడుతున్నాయి.

ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ రూ. 7 కోట్లకు పైగా మొత్తానికి అమ్మారు. కాబట్టి వివాదాలతో వార్తల్లో ఉన్న సర్కార్ ట్రెండ్ ని బట్టి చూస్తే మంచి కలెక్షన్స్ నమోదు చేసి ఒడ్డున పడిపోయేటట్లే కనపడుతోంది. వీకెండ్ ఎడ్వాంటేజ్ తో బ్రేక్ ఈవెన్ వస్తుందని ట్రేడ్ లో అంచనాలు వేస్తున్నారు. కీర్తి సురేష్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహించాడు.