అదిరింది: ‘డియర్‌ కామ్రేడ్‌’టీజర్‌ చూశారా..?!

నూతన దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ‘డియర్ కామ్రేడ్’ సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ .. బిగ్ బెన్ సినిమాస్ వారు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో కథానాయికగా రష్మిక మందన నటించింది. స్టూడెంట్ లీడర్ పాత్రలో విజయ్ దేవరకొండ .. క్రికెటర్ పాత్రలో రష్మిక కనిపించనున్నారు.

‘గీత గోవిందం’ కాంబినేషన్ కావడంతో సహజంగానే అంచనాలు ఒక రేంజ్ లో వున్నాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం టీజర్ ఎప్పుడు వస్తుందా అని విజయ్ దేవరకొండ అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ రోజు (మార్చి 17) ఉదయం 11గంటల 11 నిమిషాలకి ఈ సినిమా టీజర్ విడుదల చేసారు.

‘కడలల్లె వేచె కనులే..’ అన్న పాటతో విజయ్‌ దేవరకొండ ఫైటింగ్‌ సన్నివేశాలతో టీజర్‌ మొదలైంది. వర్షంలో విజయ్‌, రష్మిక ముద్దుపెట్టుకుంటున్న సన్నివేశంతో టీజర్‌ ముగిసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయబోతున్నారు.

Dear Comrade Telugu Teaser | Vijay Deverakonda | Rashmika | Bharat Kamma | Justin Prabhakaran | MMM

‘గీత గోవిందం’ తర్వాత విజయ్‌, రష్మిక జంటగా నటించిన చిత్రమిది. మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ బ్యానర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రముఖ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. మే 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.