విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘టాక్సీవాలా’. ఈ సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ఈ లోగా ఆన్ లైన్ లోకి వచ్చేసింది. థియేటర్లలోకి రాకముందే సోషల్ మీడియాలోకి పైరసీ కాపీ వచ్చేసింది. ఈ సినిమాను పైరసీ చేయడంతో ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కాకముందే జనాల ఫోన్లలోకి వచ్చేయటం వాస్తవానికి చాలా ఇబ్బంది పెట్టే అంశం. ఈ విషయమై ఇప్పటికే టీమ్ ..విజయ్ దేవరకొండ మాట్లాడారు.
ఈ సినిమా గురించి ఎవరు, ఎలా చెప్పినా, ఏం చెప్పినా… 17వ తేదీన ధియేటర్లలో చూడండి… నాది గ్యారెంటీ అంటూ భరోసా ఇచ్చారు. దానికి తోడు రీసెంట్ గా జరిగిన టాక్సీవాలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పైరసీపై విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు చేసారు. ఈ సినిమాను పైరసీ చేసిన వాళ్ళందరికీ ఈ నెల 17వ తేదీన నాతో పాటు ‘మిడిల్ ఫింగర్’ చూపించడానికి సిద్ధం కండి అన్నారు.
కేవలం పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్, డిఐ, మ్యూజిక్ వర్క్ పూర్తి కాకుండా లీకైన సినిమా అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ లోగా ఆ పైరసీ ప్రింట్ ఓ టోరెంట్ సైట్ లో దర్శనమిచ్చింది. ఆ విషయమై ఆ టోరెంట్ సైట్ ..తాము రిలీజ్ కు ముందే ఎందుకు అప్ లోడ్ చెయ్యాల్సి వచ్చిందో వివరణ ఇచ్చింది.
వారు చెప్పిన దాని ప్రకారం… నిజానికి ఈ ప్రింట్ తమ వద్దకు ఎప్పుడో వచ్చిందని, అయితే సినిమా రిలీజ్ తర్వాతనే దీనిని విడుదల చేద్దామని భావించామని, కానీ బలవంతంగా ఇప్పుడే విడుదల చేయడానికి కొన్ని కారణాలున్నాయి, తమను క్షమించాల్సిందా ‘టాక్సీవాలా’ యూనిట్ కు క్షమాపణలు చెప్తూ…. ఈ లీకేజ్ వీడియోను విడుదల చేసారు. అసలు ఏం జరుగుతోందో..ఎందుకు టోరెంట్ సైట్స్ వాళ్లు ఈ డెసిషన్ తీసుకున్నారో ఎవరికి ఆర్దం కావటం లేదు.