పేరుని హైజాక్ చేయటం సినీ పరిశ్రమకు కొత్తేమీ కాదు. చాలా మంది చేత స్క్రిప్టు వెర్షన్ లు రాయించి మెయిన్ రైటర్ కు క్రెడిట్ ఇస్తూంటారు. అయితే ఇప్పుడు ఏకంగా కొందరు డైరక్టర్స్ ఘోస్ట్ రైటర్స్ చేతే పని కానిచ్చే స్కీమ్ లు మొదలెట్టారు. ప్రముఖ రచయత వెన్నెల కంటి కుమారుడు శశాంక్ వెన్నెల కంటి కు అలాంటి అన్యాయమే జరిగింది. ఆయన రాసిన ఓ సినిమా డైలాగ్ వెర్షన్ ని తన పేరు మీదే తెరమీదకు తెస్తున్నాడు ఓ దర్శకుడు. ఎవరా అన్యాయం చేస్తున్న దర్శకుడు..ఏమా కథ ..
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ మూవీ నోటా. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా
ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు చిత్రయూనిట్. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సూపర్‌హిట్ తరువాత తెరకెక్కుతున్న నోటాతో విజయ్ కోలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. విజయ్ సరసన మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకుడు.
ఈ మూవీ తెలుగు వెర్షన్ కు శశాంక్ వెన్నెలకంటి మాటలు సమకూర్చారు.. అయితే ఇటీవల విడుదలైన ట్రైలర్ లో మాటలు రాసింది దర్శకుడు అనంద్ శంకర్ అంటూ టైటిల్ కార్డ్ వేశారు.. దీంతో వెన్నెలకంటే ఈ చిత్ర నిర్మాత జ్ఞానవేల్ రాజాపై చెన్నై పోలీస్ లకు ఫిర్యాదు చేశాడు.
‘నోటా’ తెలుగు వెర్షన్ కోసం దర్శకుడు ఆనంద్ శంకర్ నాతో మాటలు రాయించుకున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్లో మాటల రచయితగా నాకు క్రెడిట్ ఇవ్వకుండా తన పేరు వేసుకున్నాడు. ట్రైలర్లో వున్న డైలాగ్స్ నావే .. కానీ కథ .. స్క్రీన్ ప్లేతో పాటు మాటల క్రెడిట్ కూడా ఆనంద్ శంకర్ వేసుకున్నాడు.
తెలుగు వెర్షన్ డైలాగ్స్ రాసినందుకు నాకు రావలసిన డబ్బులతో పాటు, క్రెడిట్ కూడా ఇవ్వాలి’ అప్పటివరకూ ఈ సినిమాను విడుదల కాకుండా చూడాలని అంటూ పోలీస్ కమిషనర్ కి ఇచ్చిన ఫిర్యాదులో వెన్నెలకంటి కోరాడు. మరి విజయ్ దేవరకొండ ఈ ఇష్యూలో తల దూరుస్తాడా…తెలుగు డైలాగుల రచయితకు న్యాయం చేస్తాడా చూడాలి.