తమ్ముడికి ముహూర్తం కుదిరిందిగా!

                                                     (ధ్యాన్)

ప్ర‌స్తుతం యూత్‌లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ఫుల్ బిజీగా ఉన్నాడు. అంతే కాకుండా ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ దేవ‌కొండ హీరోగా.. రాజ‌శేఖ‌ర్ రెండ‌వ కుమార్తె శివాత్మిక రాజ‌శేఖ‌ర్ హీరోయిన్‌గా ఓ సినిమా రూపొంద‌నుంద‌నే సంగ‌తి తెలిసిందే.  విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా న‌వంబ‌ర్ 24న హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా ప్రారంభం కానుంది. సురేశ్‌బాబు, మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి, య‌ష్ రంగినేని ఈ సినిమాను నిర్మిస్తారు. కె.వి.ఆర్‌.మ‌హేంద్ర ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. తెలంగాణ‌లో జ‌రిగిన య‌దార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెర‌కెక్కిస్తార‌ట‌. ఈ చిత్రానికి `దొర‌సాని` అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్నార‌ట‌. డిసెంబ‌ర్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ఉంటుంది. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయాల‌నేది నిర్మాత‌ల ప్లాన్‌గా క‌న‌ప‌డుతుంది.