“లైగర్” నెగిటివిటీపై మైండ్ గేమ్ తో అదరగొట్టిన విజయ్ దేవరకొండ..!

ఏ సినిమాకి అయినా కూడా ప్రమోషన్స్ చాలా కీలకం అని అందరికీ తెలుసు. అయితే ఈ ప్రమోషన్స్ ని ఎలా చేసి తన సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళలో ఇప్పుడున్న యంగ్ హీరోస్ లో మన తెలుగు నుంచి అయితే సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండకి బాగా తెలుసని చెప్పొచ్చు.

విజయ్ తాను తీసింది ఏ సినిమా అయినా కూడా చాలా డిఫరెంట్ గా ఆడియెన్స్ లోకి తీసుకెళ్ళిపోతాడు. అలాగే తన స్ట్రాటజీస్ సమాధానాలు కూడా చాలా తెలివి గానే ఉంటాయి. ఇక ఇప్పుడు సరిగ్గా తన భారీ సినిమా “లైగర్” విషయంలో కూడా అదే చేయడం ఆసక్తిగా అనిపిస్తుంది.

ఈ సినిమాని తెలుగు సహా హిందిలో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే హిందీలో పలు సినిమాలకి దారుణ పరాభవాన్ని ఆడియెన్స్ చూపిస్తున్నారు. అలాగే ఈ సినిమాకి కూడా బాయ్ కాట్ చెయ్యాలంటూ సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రెండ్ చేస్తుండగా దీన్ని కూడా విజయ్ దేవరకొండ తన మార్క్ లో పాజిటివ్ గా మార్చేసుకున్నాడు.

ఈ బాయ్ కాట్ చెయ్యడం అనేది నా సినిమాకి ఖర్చు లేకుండా పబ్లిసిటీ చేసుకుంటున్నట్టు ఉందని అలా చేస్తున్న వారి అందరికీ థాంక్స్ చెప్తున్నానని లేటెస్ట్ గా తెలిపాడు. దీనితో విజయ్ మైండ్ గేమ్ సూపర్ గా సెట్టయ్యిందని చెప్పాలి.

నెగిటివ్ చేస్తున్న వారిపై కోపంగా రియాక్ట్ అవ్వకుండా వాళ్ళకే కౌంటర్ వేసిన విధంగా చేయడం విజయ్ దేవరకొండ తెలివితేటలే అని చెప్పాలి. మరి అయితే హిందిలో ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుంది అనేది అందరిలో ఆసక్తి గానే ఉంది.