సోషల్‌ విూడియా జర్నలిస్ట్‌ కావాలని ఉంది: ఉపాసన

స్టార్‌ హీరో రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన (Upasana Konidela) ఎప్పుడూ సోషల్‌ విూడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సినిమాలపై, సామాజిక అంశాలపై తన అభిప్రాయాన్ని పంచుకుంటుంటారు. అలానే వారి ఫొటోలను కూడా ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తూ అభిమానుల్లో జోష్‌ నింపుతుంటారు.

తాజాగా ఉపాసన ఓ సిరీస్‌కు రివ్యూ ఇచ్చారు. అనన్య పాండే (Ananya Panday) ప్రధానపాత్రలో నటించిన ‘కాల్‌ విూ బే’ సిరీస్‌ తనకు నచ్చిందని పేర్కొన్నారు. ఈ సిరీస్‌ పోస్టర్‌ను పంచుకున్న ఉపాసన.. ఇది చూశాక తనకు కూడా సోషల్‌ విూడియా జర్నలిస్ట్‌ కావాలనే కోరిక కలిగిందంటూ టీమ్‌ను ప్రశంసించారు.