గెస్ట్ రోల్ లో విజయ్ దేవరకొండ! గ్రేట్ ఆఫర్

స్టార్ హీరోలు గెస్ట్ రోల్ లో కనిపించటం లో పెద్ద వింతేమీ లేదు. అయితే ఓ టాలీవుడ్ నటుడు ఓ హిందీ చిత్రంలో గెస్ట్ రోల్ లో కనపడటం మాత్రం ఖచ్చితంగా చెప్పుకోదగ్గ విషయమే. ఆ క్రెడిట్ కొట్టింది మాత్రం విజయ్ దేవరకొండ మాత్రమే.

వరస విజయాలతో దూసుకుపోతున్న విజయ్‌ దేవరకొండ తన మార్కెట్‌ను మరింత విస్తరించుకునేందుకు రెడీ అవుతున్నాడు. అందులో భాగంగా బాలీవుడ్ లోకు ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్దం చేసుకున్నారు.

అర్జున్‌ రెడ్డి తరువాత విడుదలైన గీత గోవిందం, టాక్సీవాలా లాంటి హిట్స్ తో మెప్పించిన విజయ్‌ నోటా సినిమాతో తమిళ ఎంట్రీ కూడా ఇచ్చేశాడు. అదే ఊపులో హిందీ చిత్ర పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నారు. అర్జున్‌ రెడ్డి సినిమా బాలీవుడ్‌లో రీమేక్‌ అవుతుండటంతో అక్కడ కూడా విజయ్‌కు మంచి క్రేజ్‌ వచ్చింది. దాంతో విజయ్ తో సినిమా చేయాలని అక్కడ దర్సక,నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు. హిందీలో తీస్తే తమిళ,తెలుగు మార్కెట్ కూడా కలిసి వస్తుందనేది వారి ఆలోచన.

అయితే తెలుగులో పూర్తి గా సెటిల్ అయ్యేదాకా బాలీవుడ్ లో హీరోగా ఆలోచన చేసే ఆలోచన విజయ్‌కు లేదని చెప్పారట. కానీ త్వరలో ఓ బాలీవుడ్ సినిమాలో విజయ్‌ కనిపించటానికి ఒప్పించారట. అందుతున్న సమాచారం మేరకు షోర్ ఇన్ ది సిటీ, గో గోవా గానా, 99, ఎ జెంటిల్మాన్ అండ్ ఎ హ్యాపీ ఎండింగ్ చిత్రాలను నిర్మించిన కృష్ణ డికే,రాజ్ నిడమూరులతో విజయ్ ముందుకు వెల్లనున్నట్లు సమాచారం.

వారి ఆధ్వర్యంలో వస్తున్న భారీ చిత్రంలో విజయ్‌ అతిధి పాత్రలో కనిపించటం కన్ఫామ్ అయ్యిందన్న టాక్‌ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమా 2020లో రిలీజ్ కానుందన్న ప్రచారం జరుగుతోంది. మరి విజయ్‌ దేవరకొండ నటిస్తున్న ఆ బాలీవుడ్ మూవీ పూర్తి వివరాలు తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.