ఫోర్బ్స్‌ లిస్ట్ లో విజయ్‌ దేవరకొండ,ఆదాయమెంతో తెలుసా

ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన అత్యంత సంపాదన పరులైన సెలబ్రిటీల జాబితాలోకి జాయిన్ అయ్యాడు విజయ్ దేవరకొండ. అర్జున్‌ రెడ్డి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన విజయ్‌ దేవరకొండ కెరీర్ లో వేగంగా దూసుకుపోతున్నారు. ఆ తర్వాత చేసిన మహానటి, గీత గోవిందం, టాక్సీవాలా లు సూపర్ హిట్ అయ్యి ఆయన్ని టాప్ స్టార్ ని చేసేస్తాయి. దాంతో విజయ్‌ తాజాగా ఫోర్బ్స్‌ లిస్ట్ లోనూ చోటు సంపాదించుకున్నాడు.

2018లో ఎక్కువ ఆదాయాన్ని పొందిన సెలబ్రిటీల లిస్ట్‌ను రిలీజ్‌ చేసింది ఫోర్బ్స్‌. ఈ లిస్ట్‌లో 14 కోట్ల ఆదాయంతో 72 వ స్థానంలో నిలిచాడు విజయ్‌ దేవరకొండ. ఇంత తక్కువ కాలంలో ఫోర్బ్స్‌జాబితాలో స్థానం సంపాదించడం కూడా ఓ రికార్డ్‌ . ఈ లిస్ట్ సౌత్‌ నుంచి టాప్ ప్లేస్ లో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నిలవగా పవన్‌ కల్యాణ్‌, విజయ్‌, ఎన్టీఆర్‌, విక్రమ్‌, మహేష్‌ బాబు, సూర్య, విజయ్‌ సేతుపలి లాంటి హీరోలు ఉన్నారు. అదే 14 కోట్ల ఆదాయంతో రామ్ చరణ్ కూడా 72 స్దానంలో ఉన్నారు.

ఇక ఈ లిస్ట్‌లో లేడీ సూపర్‌ స్టార్‌ నయనతారకు కూడా చోటు దక్కటం విశేషం. బాలీవుడ్ కం‍డల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ 253.25 కోట్ల ఆదాయంతో తొలిస్థానంలో నిలవగా విరాట్‌ కోహ్లీ 228.09 కోట్లతో తరువాతి స్థానంలో నిలిచాడు.