హాస్పటల్ లో చేరిన విజయ్ దేవరకొండ

వరస విజయాలతో దూసుకుపోతున్న హీరో విజయ్ దేవరకొండ అనారోగ్యానికి గురయ్యారు. హైదరాబాద్ సిటీలోని ఓ స్టార్ హాస్పటిల్ లో చేరి రకరకాల టెస్ట్ లను చేయించు కోవడమే కాకుండా ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాడు . అయితే అంతగా కంగారుపడాల్సిన విషయం ఏమి కాదని తెలిసిందే. వరుసగా గ్యాప్ లేకుండా షూటింగ్ లతో బిజీగా ఉండటంతో ఒత్తిడికి లోనయ్యి ఇబ్బందిపడ్డారని తెలుస్తోంది.

నిన్న‘హోలీ’ సంబరాలు జరుపుకున్న తర్వాత విజయ్ హఠాత్తుగా కొద్దిగా వీక్ గానూ, జ్వరంగాగా అనిపించటంతో హాస్పటిల్ కు వెళ్లాల్సి వచ్చిందని సమాచారం. ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు…రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పారట.

ప్ర‌స్తుతం విజ‌య్ దేవరకొండ డియ‌ర్ కామ్రేడ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. విజ‌య్ ఒక్క రోజు షూటింగ్ వెళ్లపోయినా కాంబినేషన్ సీన్స్ సమస్య వచ్చి నిర్మాత‌గా భారీగా న‌ష్టం వచ్చే అవ‌కాశం ఉంది. అందుకే రెస్ట్ తీసుకోకుండా మళ్లీ షూటింగ్ కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. మరో ప్రక్క డియ‌ర్ కామ్రెడ్ తో పాటు క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు. అలాగే త‌మిళ ద‌ర్శ‌కుడు ఆనంద్ అన్నామ‌లై తో మ‌రో సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.