తమిళ “పింక్ “లో విద్యా బాలన్

హిందీలో సూపర్ హిట్ అయిన “పింక్ ‘ సినిమాను ఇప్పుడు తమిళంలో పునర్నిర్మిస్తున్నారు. బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం లో థలా అజిత్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడని , ఇతర పాత్రలను ఎంపిక చేయవలసి ఉందని అంటున్నారు .

ఈ చిత్రంలో  విద్యా బాలన్ ఒక ప్రత్యేక పాత్రలో కనిపించే అవకాశం వుంది. ఈ పాత్రకు కోసం విద్య ఎలాంటి పారితోషికం  తీసుకోవడం లేదని తెలుస్తుంది.

ఈ మధ్యనే ఆమె నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం షూటింగ్ ముగించుకొని ముంబై వెళ్ళింది . ఈ చిత్రంలో ఆమె రామారావు అర్ధాంగి బసవ తారకం పాత్రలో నటిస్తున్నది.

ప్రస్తుతం విద్యాబాలన్ “మిషన్ మంగళ్ ” అనే చిత్రంలో అక్షయ్ కుమార్, సోనాక్షి, తాప్సితో కల్సి నటిస్తున్నది.