మ్యాథమెటికల్ జీనియస్ బయోపిక్
ది డర్టీ పిక్చర్.. ఎన్టీఆర్ బయోపిక్.. మిషన్ మంగళ్ ఇలా వరుసగా ఆసక్తికర బయోపిక్ లలో నటించింది విద్యాబాలన్. ఆ కోవలోనే బాలన్ మరో ప్రయోగాత్మక బయోపిక్ లో నటిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. హ్యూమన్ కంప్యూటర్ `శకుంతలా దేవి- హ్యూమన్ కంప్యూటర్` బయోపిక్ నేడు లండన్ లో ప్రారంభమైంది. ఈ సినిమాలో బాలన్ ఒక గణిత శాస్త్రవేత్తగా మేధావిగా నటిస్తుండడం ఆసక్తికరం. ఇటీవలే గణిత శాస్త్రవేత్త అయిన ఆనంద్ కుమార్ జీవితకథతో తెరకెక్కిన `సూపర్ 30` సంచలన విజయం సాదించిన నేపథ్యంలో బాలన్ సెలెక్షన్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
హ్యూమన్ కంప్యూటర్ అన్న పేరు శకుంతలకు అంత గొప్ప పేరెలా వచ్చింది అని రీసెర్చ్ చేసేందుకే బాలన్ ఆరు నెలలుగా తపిస్తోందట. తాజాగా `శకుంతలా దేవి` ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. ఎర్ర చీర.. సాంప్రదాయమైన శకుంతలా దేవి లుక్ ఆకట్టుకుంది. బాలన్ తలకురుల్ని అంతే అందంగా తీర్చిదిద్దారు. అను మీనన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బాలన్ కెరీర్ లో ఇది వరుసగా నాలుగో బయోపిక్. ఇంట్రెస్టింగ్ కథాంశాల్ని ఎంచుకుని అంతే జోష్ చూపిస్తున్న బాలన్ బాలీవుడ్ నాయికల్లోనే సంథింగ్ స్పెషాలిటీతో దూసుకుపోవడం అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.