ఈ మధ్యకాలంలో ఏ సినిమాకీ జరగనంత దుష్పచారం నిన్న విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంపై జరుగుతోంది. కొన్ని వర్గాలు పనిగట్టుకుని ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సైట్లలోనూ, వాట్సప్ లలోనూ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తున్నారు . పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఇలాంటివి మామూలే కానీ ..ఈ స్దాయిలో ఎప్పుడూ ఈ మధ్యకాలంలో చూడలేదు. ఈ నందమూరి వ్యతిరేకలు చేసే పని ని కొందరు తప్పు పడుతూంటే మరికొందరు సమర్దిస్తూ కామెంట్స్ చేస్తున్నారు .
ఆ ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం బాగోలేదని , బోర్ కొట్టేసిందని, అంతేకాకుండా బాలయ్య వేసిన గెటప్ లపై రకరకాల ఘోరమైన కామెంట్స్ పెడుతున్నారు. అక్కడితో ఆగకుండా మరికొందరు… కీర్తి సురేష్ చేసిన మహా నటి సినిమా బయోపిక్ అని, ఈ సినిమా కేవలం హార్పిక్ అని కామెడీ చేస్తున్నారు. వాళ్ల టార్గెట్ బాలయ్యా లేక ఎన్టీఆర్ అనేది తెలియటం లేదు. దీన్ని ఎలా అడ్డుకోవాలా అని సినిమా టీమ్ సైతం తలపట్టుకుందిట.
వాస్తవానికి బయోపిక్ లో కొన్ని లోపాలు ఉన్న మాట నిజమే కానీ ఇంత దారుణంగా మాట్లాడటం బాగోలేదని మరికొందరు పోస్ట్ లు పెడుతున్నారు. నెగెటివ్ ప్రచారం ప్రభావం ఖచ్చితంగా కలెక్షన్లు పై పడే అవకాసం ఉంది. దీనిని ఆపేందుకు ఏదో ఒకటి టీమ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది.
ఎన్టీఆర్ మరణానంతరం దాదాపు 23 ఏళ్ల తర్వాత ఆయన బయోపిక్ తెరకెక్కింది. ఎన్టీఆర్ పాత్రలో ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ నటించిన ఈ సినిమాని భారీ రేట్లకు అమ్మారు.
ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో విద్యాబాలన్, హరికృష్ణగా కల్యాణ్‌రామ్ నటించారు. రానా, సుమంత్, నిత్యామీనన్, రకుల్ ప్రీత్ సింగ్, నరేష్, ప్రకాశ్‌రాజ్, కైకాల సత్యనారాయణ వంటి భారీ తారాగణంతో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ బయోపిక్ రూపొందింది.
ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. సినీ జీవితాన్ని మొదటి భాగంలో, రాజకీయ జీవితాన్ని రెండో బాగంలో చూపిస్తున్నారు. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు పేర్లతో నెల రోజుల గ్యాప్‌లోనే రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.