లావుగా.. నగ్నంగా ఉన్న మహిళ చిత్రం పోస్ట్ చేసింది

రీసెంట్ గా ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌లో ‘బసవతారకం’గా కీలక పాత్ర పోషించింది బాలీవుడ్‌ బొద్దుభామ విద్యాబాలన్‌. ఆమె కాస్త లావుగా ఉండటంతో అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో ఆమెకు సమస్యలు ఎదురుఅవుతున్నాయి. అయితే వాటిని ఆమె ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంటోంది.

తాజాగా ఆమె ఉమెన్స్‌ డే సందర్భంగా సోషల్‌ మీడియాలో ఓ ఫోటో పోస్ట్‌ చేసి ఆశ్చర్యపరిచారు. ఊబకాయురాలైన ఓ మహిళ నగ్న చిత్రమది. ఆ ఫోటోను పోస్ట్‌ చేసి, ‘మొదట నిన్ను నువ్వు ఇష్టపడడం నేర్చుకో.. నువ్వెంత గొప్పదానివో నీకు నువ్వు గుర్తించుకో..అంటూ ఆ ఫోటో గొప్పతనాన్ని వివరిస్తూ వచ్చారు విద్యాబాలన్‌.మీరు ఇక్కడ ఆ పొటోను చూడవచ్చు.

వాస్తవానికి కెరీర్‌ ప్రారంభం నుండీ బొద్దుగానే కనిపిస్తోంది విద్యాబాలన్‌. చాలా సార్లు ఆమె బొద్దుతనంపై విపరీతంగా ట్రాలింగ్స్‌ కూడా జరిగాయి. కొంతమందైతే విద్యాబాలన్‌ గర్భవతి అంటూ ట్రాల్‌ చేశారు . బొద్దుగా ఉంటే, గర్భవతులేనా.? అని అప్పట్లో విద్యాబాలన్‌ సూటిగా ప్రశ్నించింది.ఆమె బొద్దుగా ఉన్నా ..అవకాశాలకు మాత్రం లోటు లేదు. పెళ్లైనా ఇంకా క్రేజీ హీరోయిన్ గానే రాణిస్తోంది.