‘నా చిన్నతనం నుంచి నాకు హార్మోన్ సమస్యలున్నాయి. అందుకే బరువు పెరుగుతున్నాను. నేను చాలా అందంగా ఉన్నానని, కానీ నా బరువు కాస్త తగ్గించుకుంటే ఇంకా బాగుంటుందని నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు చాలా మంది అనేవారు. శరీర బరువు తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. కానీ నేను వ్యాయామాలు చేయనని కొందరు నన్ను ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడితే ఊరుకోను. నేను వ్యాయామం చేయనని మీకు చెప్పానా?
నా శరీరం బరువు తగ్గించుకోవడానికి ఎంత కష్టపడతానో మీకు తెలుసా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తాను. గత కొన్నాళ్లుగా నా ఫొటోలను చూసుకోవడం మానేశాను. ఎందుకంటే వాటిని చూసినప్పుడల్లా ఇప్పుడు నేను ఇంకా బరువు పెరిగాననే బాధ నన్ను వేధిస్తుంది. అందుకే నా చిన్ననాటి ఫొటోలు చూసుకోవడం మానేశాను. ఇప్పుడు నేను బరువు తగ్గడం కంటే ముందు నా ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి’ అంటోంది విద్యాబాలన్.
రీసెంట్ గా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో కనిపించిన ఆమె ప్రముఖ గణితశాస్త్ర నిపుణురాలు శకుంతల జీవితాధారంగా రానున్న చిత్రంలో విద్య నటిస్తున్నారు. ఇందులో విద్య కూతురిగా సాన్యా మల్హోత్రా నటించనుంది. మరోవైపు బాలీవుడ్ హిట్ చిత్రం ‘పింక్’ రీమేక్ ‘ఏకే 59’ అనే తమిళ చిత్రంలోనూ విద్య నటించనుంది.