వెంకీ చేతుల మీదుగా ‘మిస్ మ్యాచ్’ టీజర్!

వెంకీ చేతుల మీదుగా ‘మిస్ మ్యాచ్’ టీజర్!

‘మిస్ మ్యాచ్’ టీజర్ వచ్చేసింది… విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా విడుదలైంది….‘అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి’ సంస్థలో తొలి చిత్రం గా ‘మిస్ మ్యాచ్’ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) హీరోగా, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. తమిళంలో హీరో విజయ్ ఆంటోని నటించిన ‘సలీం’ ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ దీని దర్శకుడు. టీజర్ వయొలెంట్ యాక్షన్ సీన్స్ తో వుంది. హీరో ఉదయ శంకర్ యాక్షన్ సీన్స్ లో పవర్ఫుల్ గా కన్పిస్తున్నాడు.

యాక్షన్ సీన్స్ ప్లస్ హీరోయిన్ ఐశ్వర్య తో రోమాంటిక్ సీన్స్ నేపథ్యంలో వాయిసోవర్ వేశారు…బలమే జీవితం, బలహీనతే చావు…నీ కళ్ళల్లో లక్ష్యం, గుండెల్లో ఆత్మవిశ్వాసం…గెలిచేదాకా పరుగెత్తు…గెలిచే వాడిదే జీవితం….అంటూ. ‘ఈ సినిమా రెండు కుటుంబాల మధ్య జరిగే కథ’ అని రచయిత భూపతి రాజా చెప్పాడు. ఇప్పుడు భూపతి రాజా ఎలాటి కొత్త కథ ఇచ్చాడన్నది చూడాలి.

ఇందులో ఇతర ప్రధాన పాత్రలలో సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు నటిస్తున్నారు. సంగీతం: గిఫ్టన్ ఇలియాస్, కధ: భూపతి రాజా, మాటలు: రాజేంద్రకుమార్, మధు; ఛాయా గ్రహణం: గణేష్ చంద్ర; పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ; కళా దర్శకుడు: మణి వాసగం, దర్శకుడు. ఎన్.వి.నిర్మల్ కుమార్, నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్.

https://www.youtube.com/watch?v=-w37B5tlAmc