ఇప్పుడు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ పెళ్ళికి సంబంధించి పలు వార్తలు వస్తున్నాయి. వరుణ్ ధావన్ కొన్నాళ్ళుగా నటాశా దలాల్‌తో ప్రేమాయణంలో ఉన్నాడు. వీరి వివాహం 2019 డిసెంబర్‌లో గోవా వేదికగా జరగనుందని అన్నారు. పెళ్లి తర్వాత ముంబైలో గ్రాండ్‌గా రిసెప్షన్ జరపాలని ప్లాన్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
కాని తాజా సమాచారం ప్రకారం వరుణ్ ధావన్ వివాహం 2020లో జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో జరగనుందని చెబుతున్నారు. ఇదే వేదికగా ప్రియాంక, నిక్ జోనాస్‌ల వివాహం మూడు రోజుల పాటు జరిగిన విషయం విదితమే. వరుణ్, నటాశా ఇద్దరు చాలాసార్లు పబ్లిక్‌గా కనిపించారు. వాళ్లిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోందని చాలా పుకార్లు వచ్చినప్పటికీ.. కరణ్ జోహార్ టాక్ షో కాఫీ విత్ కరణ్‌లో నటాశాతో తనకున్న రిలేషన్‌షిప్ గురించి వరుణ్ నోరు విప్పారు. నేను తనతో డేట్ చేస్తున్నా. మీమిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం.. అని వరుణ్ ఆ షోలో ప్రకటించారు.
ప్రస్తుతం స్ట్రీట్ డ్యాన్సర్, రెమో డిసౌజ్‌తో త్రీడీ డ్యాన్స్ సినిమాలో వరుణ్ నటిస్తున్నారు. త్రీడీ డ్యాన్స్ సినిమాలో వరుణ్ సరసన శ్రద్ధా కపూర్ నటిస్తోంది