Bollywood: సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లకు సంబంధించి రూమర్లు రావడం అన్నది సహజం. ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించిన ప్రేమ పెళ్లి విడాకులు వైవాహిక జీవితాల గురించి అనేక రకాల గాసిప్స్ వినిపిస్తూ ఉంటాయి. అవి మొదట్లో గాసిప్స్ అనుకున్న చివరికి అవి నిజం అవుతూ ఉంటాయి. అలాగే కొన్ని గాసిప్స్ గానే మిగిలిపోతూ ఉంటాయి. ఇప్పటికే గతంలో చాలా మంది సెలబ్రిటీలకు సంబంధించిన ప్రేమ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వినిపించిన విషయం తెలిసిందే. కాగా సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లి అంటూ కొందరిని ప్రేమించి చివరికి ఆ ప్రేమ ఫలించక ఒంటరిగా ఉండిపోయిన వారు చాలామంది ఉన్నారు.
ఇప్పుడు మనం తెలుసుకోబోయే హీరోయిన్ కూడా అదే కోవకు చెందుతుందని చెప్పాలి. సదరు హీరోయిన్ తెలుగు, తమిళంలో వరుస సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ కొన్నేళ్లుగా ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. అందుకు గల కారణం ఆమె ప్రేమ విఫలం అవ్వడం. ఆ హీరోయిన్ మరెవరో కాదు అమీషా పటేల్. తాజాగా అమీషా పటేల్ తన 50వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. అయితే ఈ ముద్దుగుమ్మ సినిమా కెరియర్ బాగున్నప్పటికీ ఈ వ్యక్తిగత జీవితం మాత్రం అంత బాగోలేదని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే ఈమె ప్రముఖ పారిశ్రామికవేత్త నిర్వాణి బిర్లాతో తనకున్న సంబంధం గురించి వార్తలలో నిలిచింది.
నిర్వాణతో దిగిన ఫోటోస్ ఇన్ స్టాలో షేర్ చేయడంతో ఆమె పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఆ సంగతి పక్కన పెడితే.. అమీషా పటేల్ గతంలో ఒక పెళ్లైన దర్శకుడిని పిచ్చిగా ప్రేమించిందట. అతడి పేరు విక్రమ్ భట్. కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే అమీషా ఈ దర్శకుడిని ప్రేమించి తన కెరీర్ నాశనం చేసుకుందట. వీరిద్దరు కొన్నాళ్లు పాటు ప్రేమలో ఉన్నారు. కానీ అదే సమయంలో వీరు విడిపోయినట్లు టాక్ కూడా నడిచింది. విక్రమ్ భట్ తో తన సంబంధం తన కెరీర్ ను నాశనం చేసిందని అమీషా పటేల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ సంబంధం కారణంగా, ఆమె ఒక దశాబ్దానికి పైగా ప్రేమకు దూరంగా ఉండిపోయింది. తన జీవితంలో ఒక వ్యక్తిని నిజాయితీగా ప్రేమించానని అది తన అతిపెద్ద బలహీనతగా మారిందని ఆ సంబంధం తన కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపించిందని తెలిపింది. విక్రమ్ భట్ తో బ్రేకప్ తర్వాత 13 సంవత్సరాలు తన జీవితంలో మరో వ్యక్తికి స్థానం ఇవ్వలేదని తనకు ప్రశాంతత మాత్రమే ముఖ్యమని కోరుకున్నట్లు ఆమె పలు సందర్భాలలో చెప్పుకొచ్చింది. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ విషయం మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.