డేరింగ్ అండ్ డాషింగ్ హీరోయిన్, నటి వరలక్ష్మీ శరత్ కుమార్ గురించి అందరికీ తెలిసిందే. శరత్ కుమార్ ముద్దుల కూతురుగా కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మీ అనతి కాలంలో గొప్ప నటిగా పేరు తెచ్చుకుంది. హీరోయిన్, ప్రతినాయిక, స్పెషల్ క్యారెక్టర్స్ ఇలా అన్నింటిలోనూ తన సత్తాను చాటింది. కెరీర్‌లో అతి వేగంగా 25 చిత్రాలను పూర్తి చేసింది. పాత్రకు ప్రాధాన్యముంటే తప్పా అంగీకరించిన వరలక్ష్మీ టాలీవుడ్, కోలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ అయింది.
వరలక్ష్మీ పర్సనల్ విషయాలకొస్తే.. శరత్ కుమార్ మొదటి భార్య చాయా దేవీ కూతురే ఈ ఆటంబాంబ్. సినిమాల్లో అయినా, నిజ జీవితంలో అయినా ఓ ఫైర్ బ్రాండ్‌లానే ఉంటుంది. విశాల్ వ్యవహారం, మీటూ వేధింపుల విషయం ఇలా ఏదైనా సరే మొహం మీదే చెప్పేస్తుంది. విశాల్‌తో ఎంతో సన్నిహితంగా ఉన్న వరలక్ష్మీ నడిఘర్ సంఘం ఎన్నికల సమయంలో విభేదించింది. ఇక అమ్మ వరుస అయిన రాధికపైనా సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.
శరత్ కుమార్‌ను పెళ్లి చేసుకున్న రాధికను తాను అమ్మ అని సంబోధించనని కేవలం తాను నాకు ఆంటీ అవుతుందని ఆ మధ్య సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. తాజాగా రాధిక బర్త్ డే సందర్భంగా మళ్లీ ఆంటీ అంటూ సంబోధిస్తూ విషెస్ తెలిపింది. హ్యాపీ బర్త్ డే రాధికా.. నిత్యం కూల్‌గా, హ్యాపీగా ఉండు. మా తరంలోని నటుల్లో స్ఫూర్తినింపుతూ ఉండాలి. మీరు నా జీవితంలో ఉండటం నాకెంతో సంతోషం.. ఆంటీ ఈ రోజు ఎంజాయ్ చేయండి.. లవ్యూ యూ అంటూ ట్వీట్ చేసింది.