డెరైక్టర్ అనిల్ రావిపూడి లాంఛ్ చేసిన ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ ‘శివంగి’ స్టన్నింగ్ ఫస్ట్ లుక్ – మార్చి 7న సినిమా విడుదల

Shivangi: ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలలో దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వంలో ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్ పై నరేష్ బాబు పి. నిర్మించిన పవర్ ఫుల్ విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ శివంగి. జాన్ విజయ్, డాక్టర్ కోయ కిషోర్ కీలక పాత్రల్లో నటించారు.

ఈ రోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని బ్లాక్ బస్టర్ డెరైక్టర్ అనిల్ రావిపూడి లాంఛ్ చేశారు. ఈ సినిమా ఎంత పవర్ ఫుల్, సెన్సేషనల్ కథతో వుండబోతోందో ఫస్ట్ లుక్ చూస్తే అర్ధమౌతోంది.

నల్లలుంగీ, చొక్కాతో కాళ్ళపై కళ్ళు వేసుకొని సోఫాలో డైనమిక్ గా కూర్చున్న ఆనంది లుక్ స్టన్నింగ్ వుంది. విమెన్ సెంట్రిక్ సినిమాలలో శివంగి గ్రౌండ్ బ్రేకింగ్ కథ స్క్రీన్ ప్లే తో వుండబోతోంది. ఫస్ట్ లుక్ సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచింది.

ఈ చిత్రానికి A.H కాషిఫ్ – ఎబినేజర్ పాల్ మ్యూజిక్ అందిస్తున్నారు. భరణి కె ధరన్ డివోపీ గా వర్క్ చేస్తున్నారు. రఘు కులకర్ణి ఆర్ట్ డైరెక్టర్.

ఈ సినిమా పోస్ట్-ప్రొడక్షన్ చివరి దశకు చేరుకుంది. మార్చి 7న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలియజేశారు.

నటీనటులు: ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్, జాన్ విజయ్, డాక్టర్ కోయ కిషోర్

దర్శకత్వం: దేవరాజ్ భరణి ధరన్
నిర్మాత: నరేష్ బాబు పి
సంగీతం:A.H కాషిఫ్ – ఎబినేజర్ పాల్
డీవోపే : భరణి కె ధరన్
ఆర్ట్: రఘు కులకర్ణి
సింగర్:సాహితీ చాగంటి +
సాహిత్యం: శ్రీనివాస్ కామేపల్లి, దేవరాజ్ భరణి ధరన్
పీఆర్వో: తేజస్వీ సజ్జా

పవన్, బీజేపీ ప్లాన్| Senior Journalist Bharadwaj About BJP Politics || Pawan Kalyan | Naga Babu | TR