బికినీలో వయ్యారాల్ని వడ్డించడం ముంబై ముద్దుగుమ్మలకు కొత్తేమీ కాదు కానీ.. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న వాణీ కపూర్ యవ్వారం చూశాక పరేషాను అవ్వకుండా ఉండలేరు. ఆహాకళ్యాణం చిత్రంతో లక్ చేసుకున్నా ఈ అమ్మడికి కలిసి రాలేదు. ఆ ఫేస్‌లో అసలు ఎక్స్‌ప్రెషన్ అన్నదే ఉండదన్న విమర్శలు వచ్చాయి. యశ్‌రాజ్ ఫిలింస్ ఏం చూసి ఈ అమ్మడికి అవకాశాలిస్తోందో కానీ.. అసలు టాప్ మోడల్ ర్యాంప్‌పై తిరుగాడినట్టు క్యాట్ వాక్‌లు తప్ప నటన అన్నదే కనిపించదు. బహుశా అంతగా ప్రాధాన్యత లేని పరిమితమైన పాత్రలోనే వాణీకి ఛాన్సిచ్చారో ఏమో కానీ.. `వార్`లో ఈ అమ్మడు అందాల విందు మాత్రమే కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన గుంగురో గీతంలో వాణీ బికినీలో వన్నె చిన్నెలు ప్రదర్శించడం తప్ప ఆ ముఖారవిందంలో ఎక్స్ ప్రెషన్ టార్చ్ వేసి వెతికినా కనిపించనేలేదు.
హృతిక్- టైగర్ మధ్యలో వాణీ
హృతిక్ రోషన్- కత్రినా కైఫ్ జోడీ ఇదివరకూ బ్యాంగ్ బ్యాంగ్ చిత్రంలో నటించారు. ఆ సినిమా టైటిల్ ట్రాక్‌లో అద్భుతమైన కెమిస్ట్రీ, డ్యాన్సింగ్ ట్యాలెంట్ తో కట్టి పడేశారు. `బ్యాంగ్ బ్యాంగ్` విడుదలై సరిగ్గా ఐదేళ్ల తర్వాత దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ హృతిక్- వాణీ జంటను రిపీట్ చేస్తూ వార్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టైగర్ ష్రాఫ్ పోలీస్ అధికారిగా నటిస్తుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇటీవలే రిలీజైన వార్ ట్రైలర్ ఆకట్టుకుంది. తాజాగా గుంగురే అంటూ హృతిక్ – వాణీ జోడీపై చిత్రీకరించిన పాట రిలీజైంది. ఈ పాటలో వాణీ బికినీ సొగసులు హైలైట్ గా ఆవిష్కరించడం యువతరానికి స్పెషల్ ట్రీట్ అనే చెప్పాలి.