వీడియో: ఎన్టీఆర్ జ‌ప‌నీ ఫ్యాన్ డ్యాన్సులు చూశారా

జ‌పాన్ అన‌గానే సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కి ఉన్న ఫాలోయింగ్ గుర్తుకు వ‌స్తుంది. ఆ త‌ర్వాత బాహుబ‌లి స్టార్లు ప్ర‌భాస్ – రానాకు అంతే ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ఇక ఆ ముగ్గురు స్టార్ల‌తో పాటు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కి అక్క‌డ వీరాభిమానులున్నారు. ముఖ్యంగా తార‌క్ డ్యాన్సుల్ని ఇష్ట‌ప‌డే జ‌ప‌నీ ప్యాన్స్ కి కొద‌వేం లేదు.

తాజాగా తార‌క్ జ‌ప‌నీ అభిమాని ట్విట్ట‌ర్ లో షేర్ చేసిన డ్యాన్సింగ్ వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. 2006 లో వ‌చ్చిన అశోక్ మూవీలో తార‌క్ – స‌మీరా రెడ్డి జంట గోల గోల పాట‌కు ల్యాండ్ మార్క్ స్టెప్పులు వేసి అల‌రించిన సంగ‌తి తెలిసిందే. ఆ పాట‌ను ఎంపిక చేసుకుని య‌థాత‌థంగా స్టెప్పుల్ని దించేసింది ఈ జ‌ప‌నీ జంట‌.

తార‌క్ బాడీ లాంగ్వేజ్ స‌హా లెగ్ మూవ్ మెంట్ ఎన‌ర్జీని స‌ద‌రు జ‌ప‌నీ ఫ్యాన్ అడాప్ట్ చేసుకున్న తీరు ఆస‌క్తిక‌రం. అలాగే అత‌డి భార్యామ‌ణి స‌మీరా రెడ్డిని మ్యాచ్ చేస్తూ స్టెప్పులు వేసింది. ఎడిటెడ్ వీడియోని ఈ జంట ట్విట్ట‌ర్ లో షేర్ చేయ‌గా.. అది తార‌క్ అభిమానుల్లోనూ వైర‌ల్ గా మారింది. ఈ జ‌ప‌నీ జంట డ్యాన్సుల‌కు తార‌క్ ఫ్యాన్స్ ఉబ్బిత‌బ్బిబ్బ‌యిపోతున్నారు. మొత్తానికి తార‌క్ కి జ‌పాన్ లో ఉన్న ఫీవ‌ర్ ఆర్.ఆర్.ఆర్ కి ప్ల‌స్ అవుతుందేమో చూడాలి.