చిరు తో ఎందుకు పెట్టుకున్నాం అని తలపట్టుకున్నారు

‘వార్‌’ తెలుగు లో పరిస్దితి దారుణం

మెగాస్టార్ చిరంజీవి కెరియర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మంగా రూపొందుతున్న చిత్రం ‘సైరా’ . రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న మూవీని తెలుగు, తమిళం,కన్నడం,మలయాళ భాషలతో పాటు హిందీలోనూ ఒకేసారి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ రామ్ చరణ్ తన ప్రమోషన్ టెక్నిక్స్ లో ఈ మూవీకి సౌత్ ఇండియాతో పాటు బాలీవుడ్ లోనూ భారీ అంచనాలు పెంచేశాడు. అదే రోజున విడుదల అవుతున్న మరో బాలీవుడ్ భారీ చిత్రం వార్.

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘వార్‌’. ‘బ్యాంగ్‌ బ్యాంగ్‌’ దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమా తెలుగు వెర్షన్ ని సైతం భారీగా విడుదల చేస్తున్నారు . అయితే ఈ చిత్రానికి తెలుగులో థియోటర్స్ దక్కే పరిస్దితి కనపడటం లేదు. అలాగే తెలుగులో తీసుకుని రిలీజ్ చేస్తున్న వాళ్లు లేరు. దాంతో హిందీ నిర్మాతలే డైరక్ట్ గా తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు.

ఇక మాగ్జిమం థియోటర్స్ లో అధికభాగం సైరా సినిమా ఆక్రమించుకుంది. హిందీలోనూ భారీగానే సైరా రిలీజ్ అవుతూండటంతో అక్కడా వార్ కు థియోటర్స్ సమస్య వస్తోందని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో రిలీజ్ డేట్ అదే రోజు ఎందుకు పెట్టుకున్నామా అని తలపట్టుకుంటున్నారట. మరో ప్రక్క సైరా వెంటనే చాణక్య కూడా తెలుగులో వచ్చేస్తోంది.దాంతో మిగిలిన ఒకటి అరా థియోటర్స్ కూడా దొరికే పరిస్దితి లేదు.

War Trailer | Hrithik Roshan | Tiger Shroff | Vaani Kapoor | Telugu Version | YRF Spy Universe

యాక్షన్‌కు పెట్టింది పేరు హృతిక్‌, టైగర్‌. ఇప్పుడు ఇద్దరూ తెరపై సందడి చేసేందుకు సిద్ధం కావడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. హృతిక్‌, టైగర్‌ మధ్య వచ్చే భారీ ఫైట్ సీన్స్ , ఉత్కంఠ రేకెత్తించే కార్‌ ఛేజింగులు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతాయని చిత్రయూనిట్ చెబుతోంది. ఈ చిత్రంలో వాణీ కపూర్‌ హీరోయిన్. యశ్‌రాజ్‌ ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం గాంధీ జయంతి సందర్భంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.