నేను విలన్ గా చేసే దౌర్భాగ్యం ఏంటిరా ! మహేష్ టీం పై మండిపడ్డ కన్నడ స్టార్

Upendra Rejects Mahesh Babu offer

‘అతను సూపర్ స్టార్ అయితే నాకేంటి.. ఆ మాటకొస్తే నేనూ సూపర్ స్టార్ నే కదా..’ సూపర్ స్టార్ మహేశ్ బాబు గురించి ఒక కన్నడ స్టార్ అన్న డైలాగ్ అంట ఇది, ఇందులో ఎంత నిజం ఉందో గానీ, ఫిల్మ్ సర్కిల్స్ లోని తాజా గుసగుసల సారంశం ప్రకారం.. మహేష్ పుట్టినరోజు నాడే ‘సర్కారు వారి పాట’ నుండి ఒక క్రేజీ అప్ డేట్ రావాలి, అది కూడా సినిమాలోని మెయిన్ క్యారెక్టర్ గురించి. ఆ క్యారెక్టర్ లో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటిస్తున్నాడని.. మన రాతల రాయుళ్ళు ఆల్ రెడీ ఎప్పుడో డప్పేసేశారు. కాకపోతే ఆ పాత్రలో ఉపేంద్ర చెయ్యనని స్పష్టం చేసేశాడు. తోటి పరిశ్రమల్లోని స్టార్ హీరోలు, పక్క పరిశ్రమల స్టార్ల పై నిజానికి కొంత సాఫ్ట్ కార్నర్ ఉంటుంది.

అంతమాత్రాన విలన్ గా యాక్ట్ చెయ్యమంటే వారు ఎందుకు చేస్తారు. పైగా సూపర్ స్టార్ లాంటి హీరోని తన్నులు తినే క్యారెక్టర్ చేయమంటే.. ఎవరికైనా ఇబ్బందే కదా. మొత్తానికి ఉపేంద్ర కూడా అలాంటి ఇబ్బందే ఫీల్ అయ్యాడు, ఫైనల్ గా మహేష్ సినిమాని లైట్ తీసుకున్నాడు. ఎక్కువ మాట్లాడితే సీరియస్ అయ్యేలా ఉన్నాడట. స్టార్ హీరోగా ఉంటూ, నేను విలన్ గా చేసే దౌర్భాగ్యం ఏంటిరా బాబు అంటూ ఈ కన్నడ సూపర్ స్టార్ డైరెక్ట్ గానే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాడట. ఇక ‘సర్కారు వారి పాట’ టీం ఇప్పుడు ఆ పాత్ర కోసం మరో స్టార్ ను వెతుక్కునే పనిలో పడింది.

పరుశురామ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ఆర్ధిక రంగంలోని లొసుగుల వ్యవహరాలకు, సామాజిక అంశాన్ని జోడించి.. పక్కా కమర్షియల్ సినిమాగా ఈ సినిమాని తీయాలని పరుశురామ్ ముమ్మరంగానే ప్రయత్నం చేస్తున్నాడు. మరి జీవతంలో వచ్చిన మొదటి పెద్ద ఛాన్స్ అయ్యే.. అందుకే చాన్స్ తీసుకోవట్లేదు. ప్రతి విషయంలోనూ లోతుగా ముందుకు పోతున్నాడట, మరి లోతు ఎక్కువైతే మునిగిపోయే చాన్స్ కూడా ఉందనుకోండి, అదే వేరే విషయం. ఇక ఈ చిత్రంలో ఆహ్లాదకరమైన ఓ లవ్ ట్రాక్‌… ఆ ట్రాక్ లో మహేష్ బాబు లవర్ బాయ్‌.. ఇది కాస్త వినడానికి బాగా ఇబ్బందిగా ఉన్నా.. మేకర్స్ తమ సినిమాని ఇలాగే ప్రమోషన్ చేసుకుంటున్నారు.