ఇండస్ట్రీ టాక్ : “సర్కారు వారి పాట”లో క్రేజీ సాంగ్ ఈ డేట్ న ఉంటుందట.!

టాలీవుడ్ ఆల్ టైం హ్యాండ్సమ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ భారీ చిత్రం “సర్కారు వారి పాట”. మహేష్ బాబు కెరీర్ లో వరుస హ్యాట్రిక్ హిట్స్ తర్వాత ఈ సినిమా రిలీజ్ అయ్యి భారీ హిట్ అయ్యింది. రికార్డు వసూళ్లతో అదరగొట్టిన ఈ చిత్రానికి మేకర్స్ అయితే ఎప్పటికప్పుడు మంచి హై ఇస్తూ లేపడానికి ట్రై చేస్తున్నారు.

ఇక సినిమా కలెక్షన్ కాస్త డౌన్ అవుతున్నాయి అనగా సినిమాలో మొదట పెట్టని ఒక సాంగ్ కి కొన్ని రోజులు తర్వాత యాడ్ చేస్తున్నట్టుగా తెలిసింది. దీనిని సంగీత దర్శకుడు థమన్ కూడా కన్ఫర్మ్ చేసాడు. అయితే అది అనుకోని రీతిలో మొన్న శుక్రవారం నుంచి అందుబాటిలోకి రాలేదు.

అయితే ఇప్పుడు దీనిపై ఇండస్ట్రీ వర్గాలు నుంచి టాక్ వినిపిస్తుంది. దీనితో అయితే ఈ మురరావు బావ అనే స్పెషల్ సాంగ్ ని చిత్ర యూనిట్ ఈ మే 31 నుంచి పెడుతున్నట్టు తెలుస్తుంది. ఇదైతే ఖాయం అని అంటున్నారు. మొదట మిస్ అయ్యిన డేట్ తో అయితే అభిమానులు కాస్త నిరాశ పడ్డారు.

మరి ఈ సారి అయినా ఉంటుందో లేదో చూడాలి. ఇక ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా నదియా, సముద్రఖని ఇతర నటులు నటించారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు నిర్మాణం అందించారు.