ఫైనల్ గా “సర్కారు వారి పాట”లో మరో మాస్ సాంగ్ ని పెట్టేసారట.!

టాలీవుడ్ ఆల్ టైం హ్యాండ్సమ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురాం పెట్ల తో చేసిన ఈ ఫస్ట్ ఎవర్ సినిమా మహేహ్ కెరీర్ లో ఒక మరో హిట్ గా నిలిచింది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుంచే ప్రతి అంశంలో దర్శకుడు పరశురాం చాలా కేర్ తీసుకొని మహేష్ ని నెవర్ బిఫోర్ గా ప్రెజెంట్ చేస్తూ ట్రీట్ ఇవ్వాలని ప్లాన్ చేశారు.

ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మీల్స్ ఇవ్వడమే లక్ష్యంగా ప్లాన్ చేసి ఎక్కడ గ్యాప్ దొరికినా ఓ రేంజ్ ట్రీట్ ఇచ్చే పని చేసారు. అలా లాస్ట్ మినిట్ లో రెండు సూపర్ హిట్ సాంగ్స్ ని చేయగా వాటిలో మాస్ నంబర్ మ మ మహేశా సాంగ్ ఓ లెవెల్ ట్రీట్ ఇవ్వగా దీనితో పాటుగా ఇంకో అదిరిపోయే సాంగ్ మహేష్ మరియు కీర్తి సురేష్ ల మధ్య ప్లాన్ చేశారు. ఆ సాంగే “మురారి బావ”. అయితే ఈ సాంగ్ ఎప్పుడో యాడ్ కావాల్సి ఉండగా..

ఫైనల్ గా ఈ సాంగ్ ని ఈరోజు నుంచి పూర్తి స్థాయిలో యాడ్ చేస్తున్నట్టుగా ఇందులో మహేష్ మరియు కీర్తి సురేష్ ల లుక్ ని రిలీజ్ చేశారు. అంతే కాకుండా సంగీత దర్శకుడు థమన్ కూడా నాకు బాగా నచ్చిన సాంగ్ ని అటాచ్ చేసాం థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చెయ్యండి అని తెలిపాడు. ఇక ఈ సినిమాలో సముద్రకని, నదియా తదితరులు కీలక పాత్రల్లో నటించగా 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ మరియు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.