ఉగ్రరూప‌స్య డైరెక్టర్ సరికొత్త సినిమా ఇదే .. మరొక మహాద్భుతం..!

ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య!! అంటూ సరికొత్త పంథాలో సినిమా తీశాడు. నేచురల్ వేలోనే సినిమా తీశాడు.. రెండోసారి ఆక‌ట్టుకున్నాడు. ఈసారి ఏకంగా అమెరికా బ్యాక్ గ్రౌండ్ లో సినిమా తీస్తున్నాడు మ‌రి..! మ‌రొక మ‌హాద్బుత‌మేనా?

uma maheshwara ugra roopasya movie new attempt by director
uma maheshwara ugra roopasya movie new attempt by director

నేటివిటీకి రియాలిటీకి చేరువ‌గా ఉండే పాత్ర‌ల్ని ఎంచుకుని అంతే సింపుల్ స్టోరీతో సినిమాలు తీస్తున్నాడు వెంక‌టేష్ మ‌హా. కేరాఫ్ కంచ‌ర పాలెం .. స్క్రీన్ ప్లే ఆధారంగా రూపొందించిన క్లాసిక్ నేచుర‌లిస్టిక్ ఎటెంప్ట్. తొలి ప్ర‌య‌త్న‌మే పెద్ద స‌క్సెస‌య్యాడు. ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్ గా స‌క్సెస‌వ్వ‌డ‌మే గాక అవార్డుల్ని తెచ్చింది.

ఆ త‌ర్వాత అత‌డు ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య!! అంటూ కాస్త సీరియ‌స్ టోన్ ఉన్న టైటిల్ తీసుకుని నేచురల్ వేలోనే సినిమా తీశాడు. ఈ సినిమా క‌థ క‌థ‌నాలు ఆద్యంతం ర‌క్తి క‌ట్టించాయి. ఇప్పుడు మూడో ప్ర‌య‌త్నం ఉత్కంఠ భ‌రిత‌మే.

అయితే అత‌డు ఏకంగా అమెరికాలో ఈ సినిమాని తెర‌కెక్కించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. `సుమ‌తి .. వైజాగ్ ని వ‌దిలేసి అమెరికా..!` అనే టైటిల్ లోనే మీనింగ్ చూపించేశాడు. అమెరికా ఎంపైర్ స్టేట్ నేప‌థ్యంలో సినిమా క‌థ‌ను రాసుకున్నాడ‌ట‌. ఇది కూడా త‌న రియ‌ల్ లైఫ్ లో ఎదురైన పాత్ర‌ల ఆధారంగా రూపొందించిన క‌థ. ఒక ప‌ల్లెటూరికి చెందిన‌ వృద్ధురాలు తొలిసారి ప‌ట్నం వ‌స్తే ఎదుర‌య్యే పాట్లు ఎలా ఉంటాయి? అన్న‌ది థీమ్ లైన్. ఇప్పుడు ప‌ల్లె నుంచి ప‌ట్నంకి రావ‌డం కామ‌న్. కానీ అమెరికా అంద‌రూ వెళ్ల‌రు క‌దా? అందుకే ఈ మూవీలో ఏదైనా మ్యాజికల్ పాత్ర‌ను ఆవిష్క‌రిస్తాడేమో చూడాలి. అన్న‌ట్టు వెంక‌టేష్ మ‌హా త‌న తొలి సినిమా త‌ర్వాత రెండో సినిమాని బ‌య‌ట‌కు తేవ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టింది. ఆ క్ర‌మంలోనే అత‌డు ఫిలింమేకింగ్ కోర్సును పూర్తి చేసాడ‌ట‌.