దగ్గుబాటి రానా ప్రేమ వ్యవహారం పెద్ద షాకింగ్ ట్విస్ట్. అసలు రానా ప్రేమలో పడినట్టు కానీ.. త్వరలో పెళ్లికి రెడీ అవుతున్నట్టు కానీ ఏదీ ఇన్నాళ్లు సరైన క్లూ కూడా లేదు. ఉన్నట్టుండి సడెన్ గా ప్రేమించామని నితిన్ – నిఖిల్ లాంటి హీరోలు బయటపడినట్టే.. మన భళ్లాలుడు రానా కూడా సడెన్ గానే ఓపెనయ్యాడు. అన్నట్టు మిహీకా బజాజ్ తో రానా ఎలా లవ్ లో పడ్డాడు? అసలు రానాకు ఆ అమ్మాయితో కనెక్షన్ ఎలా కుదిరింది? అంటే…
అందరిలానే పెళ్లిళ్లు పబ్బాలు ఇండ్లలో వేడుకలు, సిటీలో పార్టీలు అలాంటప్పుడు కలవడాలు వగైరా వగైరా కారణమని అంతా ఊహించేస్తున్నారు. అసలే మిహీకా బజాజ్ వెడ్డింగ్ ప్లానర్. దగ్గుబాటి ఇంట ఇంతకుముందు ఓ పెళ్లి కూడా జరిగింది. విక్టరీ వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత వివాహ మహోత్సవం అయ్యింది. అలాగే రానా ఇంతకుముందు అమర్ చిత్రకథ పేరుతో రామానాయుడు స్టూడియోస్ లో ఓ బిజినెస్ ని కూడా ప్లాన్ చేశాడు. వీటన్నిటికీ మిహీరానే డిజైనర్ అని గెస్ చేస్తున్నారు అభిమానులు. ఇక మిహీరాకు వెంకీ కుమార్తె ఆశ్రిత చాలా క్లోజ్. ఆ ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్ని వెంకీ నారప్ప టీమ్ రివీల్ చేయడంతో కాస్త క్లోజ్ గానే డీటెయిల్స్ లీకయ్యాయని చెప్పొచ్చు. తన సోదరి ఫ్రెండునే రానా పెళ్లాడుతున్నాడని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక హైదరాబాద్ ఫేజ్ 3 జనం కలిసే చోటు ఏది? అంటే క్లబ్బు.. పబ్బు.. రెస్టారెంట్.. ఇవన్నీ ప్రేమ గువ్వలకు కలిసొచ్చే స్థలాలే.
ఇక అటు బాలీవుడ్ ఫ్యాషనిస్టా సోనమ్ కపూర్ కి కూడా మిహీరా చాలా క్లోజ్. ఫ్యాషన్ ఈవెంట్ల ద్వారా ఆ ఇద్దరి మధ్యా స్నేహం కుదిరి ఉండొచ్చు. అలాగే మిహీరా తల్లి గారు బంటీ ఫేమస్ వెడ్డింగ్ జువెలరీ డిజైనర్. అందువల్ల కూడా మిహీరా సర్కిల్ హైదరాబాద్ టు ముంబై విస్తరించింది. ఇలా చూస్తే రానా కనెక్షన్ ఎక్కడో ఇట్టే పట్టేయొచ్చు. అన్నట్టు రానా తన సినిమాలన్నిటినీ మిహీరాకి చూపిస్తుంటాడా లేదా? కార్నర్ సీట్లో పాప్ కార్న్ తింటూ జంటగా సినిమాలు చూశారా లేదా? తెలియాల్సి ఉంది.
One more pic pic.twitter.com/J7ChtkjEYk
— Nagaraja Reddy (@NagarajaReddyS) May 13, 2020