Niharika: అల్లు అర్జున్ తో లవ్ స్టోరీ అంటున్న నిహారిక..పాపం స్నేహ రెడ్డి పరిస్థితి ఏంటీ భయ్యా?

Niharika: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు యాంకర్ గా తన కెరియర్ బుల్లితెరపై ప్రారంభించిన నిహారిక అనంతరం వెండితెరపై హీరోయిన్గా కూడా నటించారు. హీరోయిన్గా ఈమె పెద్దగా సక్సెస్ అందుకో లేకపోయినా తర్వాత నిర్మాతగా మారి పలు సినిమాలో వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ వచ్చారు.. నిహారిక నిర్మాతగా మాత్రం మంచి సక్సెస్ అందుకుందని చెప్పాలి.

నిహారిక నిర్మాతగా మారి ఇటీవల కమిటీ కుర్రాళ్ళు అనే సినిమాను నిర్మిస్తూ ఇండస్ట్రీకి కొత్త వారిని పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ద్వారా నిహారిక భారీ స్థాయిలో లాభాలను కూడా అందుకున్నారు. ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో నిహారిక వర్సటైల్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డును కూడా అందుకుంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె పలువురు టాలీవుడ్ హీరోల గురించి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు.

మీకు కనుక టాలీవుడ్ హీరోలతో సినిమా చేసే అవకాశం వస్తే ఏ హీరోలతో ఏ జానర్ లో సినిమాలు చేస్తారు అంటూ ఈమెకు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు నిహారిక సమాధానం చెబుతూ… మహేష్ బాబుతో మైథాలాజికల్ సినిమా చేస్తానని తెలిపారు. ఇక పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ బుజ్జిగాడు సినిమాలో అద్భుతమైన కామెడీ పండించారు అదే తరహా సినిమా ప్రభాస్ తో చేస్తానని తెలిపారు.

ఇకపోతే తన బావ అల్లు అర్జున్ తో కూడా సినిమా చేస్తానని, ఇప్పటివరకు ఆయన యాక్షన్ సినిమాలు చేశారు కనుక తనతో సినిమా చేసే అవకాశం వస్తే తప్పకుండా లవ్ స్టోరీ చేస్తాను అంటూ నిహారిక కామెంట్లు చేశారు. ఇక ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పాపం స్నేహారెడ్డి పరిస్థితి ఏంటి ఆమె ఒప్పుకుంటుందా అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇలా నిర్మాతగా ఈ ముగ్గురు హీరోలతో సినిమా చేస్తానని చెప్పిన నిహారిక తనకు మాత్రం దర్శకురాలిగా అవకాశం వస్తే మాత్రం మొట్టమొదటిసారిగా తన అన్నయ్య రామ్ చరణ్ తోనే సినిమా చేస్తాను అంటూ నిహారిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.