మీడియాలో ఏదో రకంగా క్రేజ్ తెచ్చుకోకపోతే కెరీర్ లో మనుగడ ఉండటం లేదు. ఇది ఈ కాలం చిన్న,పెద్ద,బుల్లి సెలబ్రెటీలందరీకి తెలుసు. ఆ క్రేజ్ ఉంటేనే ఆఫర్స్ వస్తున్నాయి..డబ్బు డిమాండ్ చేసే అవకాసం ఉంటోంది. ఈ విషయం అందరికన్నా కాస్తంత ఎక్కువ టీవీ ఆర్టిస్ట్ సలోని చోప్రా వంటపట్టించుకుంది. తను సినిమా నటి కాదు..మోడల్ కాదు..ఏదో ఓ టీవి నటి. మరి తనకు పాపులారిటి రావాలి..అందుకు ఏదో ఒకటి చేసి నలుగురు కళ్లల్లో పడాలి. అందుకు సోషల్ మీడియా సహకారం ఉండనే ఉంది.
అందుకే ఈ ఎమ్ టీవీ అమ్మాయి..రీసెంట్ గా టాప్ లెస్ ఫొటోలు దిగి తన ఇనిస్ట్రగ్రమ్ ఎక్కౌంట్ లో పోస్ట్ చేసింది. అయితే ఇలా అడ్డ దిడ్డంగా ఎప్పుడు పడితే అప్పుడు అర్ద నగ్న ఫొటోలు పోస్ట్ చేస్తే బాగోదు కదా అందుకే…దానికో కారణం వెతుక్కుంది. తాను కొద్దిగా బొద్దిగా ఉండటం వల్ల ..తను గర్బవతి అని అందరూ అంటున్నారని, మెసేజ్ లు పెడుతున్నారని వాపోతూ వారికు తను ప్రెగ్నెంట్ ని కాదని చెప్పటం కోసమే ఇదిగో ఇలా ఫోజు ఇచ్చానంటూ ఓ హాట్ ఫొటో షేర్ చేసింది.
పనిలో పనిగా ఓ పెద్ద పోస్ట్ కూడా కలిపి పెట్టింది. స్లిమ్ గా ఉండే అమ్మాయిలే ఆరోగ్యంగా ఉంటారని అనుకోవద్దని, తనలాంటి కొద్దిగా ఉన్న అమ్మాయిలు ఆరోగ్యవంతులే నని, ఆరోగ్యమే ..అందానికి ప్రామాణికం అంటూ ఓ పెద్ద క్లాసే తీసుకుంది.
సర్లేండి కారణం ఎవరిక్కావాలి..మాకు ఫోటో కావాలి కానీ అని ఆమె అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అదీ మ్యాటర్ .