తెలంగాణలో ఒకవైపు ఎన్నికల సంఘం తిట్ల భాషపై కన్నెర్రజేస్తున్నది. బూతు తిట్లు మాట్లాడే వారిపై ప్రత్యర్థులు ఫిర్యాదు చేయగానే ఈసి నోటీసులు జారీ చేసింది. ఇలా నోరు జారిన వారు, నోరు పారేసుకున్న వారందరికీ తాఖీదులు పంపింది ఈసి. తాఖీదులు అందుకున్నవారిలో రేవంత్ రెడ్డి, హరీష్ రావు, రేవూరి ప్రకాష్ రెడ్డి, వంటేరు ప్రతాపరెడ్డి లాంటి వారందరికీ ఈసి నోటీసులు అందాయి.
అయితే తెలంగాణ సిఎం కేసిఆర్, ఆయన కుటుంబసభ్యలే టార్గెట్ గా కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి గత నాలుగున్నరేళ్లుగా తిట్ల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. కేసిఆర్ ఒకటంటే నాలుగు అన్నట్లు రేవంత్ మాటల దాడి కొనసాగింది. దీంతో రేవంత్ కు రేవంత్ భాషలోనే గట్టి సమాధానం చెప్పారు కొడంగల్ టిఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి.
రేవంత్ రెడ్డి చిల్లరగాడు అంటూ మండిపడ్డారు. రేవంత్ సన్నాసి అని తిట్టారు. కొడంగల్ లోనే రేవంత్ ను ఓడిస్తానని చాలెంజ్ చేశారు. రేవంత్ ఢిల్లీకి పారిపోయిండు తప్ప తాను కాదని చెప్పారు. దొంగ మాటలు మాట్లాడే రేవంత్ కు తగిన గుణపాఠం చెబుతానని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి 2 జిమ్మిక్కులు చేస్తే నాలుగు జిమ్మిక్కులు చేస్తా అని హెచ్చరించారు. నీ కథేంటో తేలుస్తా అని వార్నింగ్ ఇచ్చారు.
నరేందర్ రెడ్డి కొడంగల్ లో పోటీ నుంచి తప్పుకోబోతున్నట్లు ఇటీవల కాలంలో ప్రచారం సాగింది. ఆయన స్థానంలో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పోటీ చేస్తారని టాక్ వచ్చింది. ఆ నేపథ్యంలో పట్నం నరేందర్ రెడ్డి రేవంత్ మీద నిప్పులు చెరిగారు.
నరేందర్ రెడ్డి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన ఏమన్నారో కింద వీడియోలో చూడండి.