కరోనా విలయతాండవమాడుతోంది. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్ని అల్లాడిస్తోంది. నిరంతరం 10వేల కేసులు బయటపడుతుంటే జనం భయాందోళనతో ఉన్నారు. ఇక వినోదపరిశ్రమకు ఈ క్రైసిస్ అశనిపాతమే అయ్యింది. ఈ నాలుగైదు నెలల్లో టాలీవుడ్ ఎంత నష్టపోయి ఉంటుంది? అన్నది అంచనా వేస్తే షాక్ తినాల్సిందే.
ఇప్పటికి తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇండస్ట్రీ నష్టపోయిన ఆదాయం అంతా కలుపుకొని దాదాపు 600 కోట్లు ఉండచ్చు అని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. పరోక్షంగా ఈ నష్టం 1000 కోట్లు కూడా ఉండచ్చు అని అంచనా. ఈ అంచనా ఇంకా పెరగొచ్చు అని కూడా చెబుతున్నారు.
టాలీవుడ్ లో దాదాపు నెలకి 6 నుంచి 10 సినిమాలు రిలీజ్ అవ్వాల్సి ఉంది. 1200 పై చిలుకు సింగల్ స్క్రీన్స్ మల్టీ ప్లెక్సీలు తో కలిపితే ఆ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుంది. కానీ ఇప్పటికీ థియేటర్లు తెరుచుకోక నానా అగచాట్లు ఎదురవుతున్నాయి. ఎటు చూసినా ఇండస్ట్రీ తో పాటు ఇండస్ట్రీ మీద ఆదారి పడి బ్రతికే వారు చాలా నాశనం అవుతున్న సన్నివేశం కనిపిస్తోందని నివేదిస్తున్నారు.