అను ఇమ్మాన్యుయల్‌కి ఇప్పటిదాకా ప్రాపర్ హిట్ లేదు. అయినా ఆమెకు ఆఫర్లు మాత్రం వరుసగా ఉన్నాయి. ఆమె కీలక పాత్రలో నటించిన శైలజారెడ్డి అల్లుడు ఈనెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా అను చెప్పిన విషయాలు `తెలుగు రాజ్యం` పాఠకుల కోసం…
* మీ సినిమా గురించి చెప్పండి?
– ఇందులో నేను ఇగోయిస్టిక్, ఆంగ్రీ విమెన్‌గా నటించా. రియల్ లైఫ్‌లో నాకు కొంచెం ఇగో ఉంటుంది. కోపం కూడా ఉంటుంది. నా లక్షణాల వల్ల నా స్టాఫ్ ఇబ్బందిపడుతుంటారు.
<
* మీరు, రమ్యకృష్ణగారు పోటాపోటీగా నటించారా?
– ఆమె చూస్తేనే నాకు వణుకు మొదలయ్యేది. ఎంతగా వణికిపోయేదాన్నంటే సీన్లు చేయడానికి కూడా కాస్త ఇబ్బందిగానే ఉండేది.
* ఆమె దగ్గర టిప్స్ తీసుకున్నారా?
– టిప్స్ అని అడగలేదు. కాకపోతే నేను ఇంతకు ముందు చేసిన సినిమాలు ఆడనప్పుడు చాలా ఫీలయ్యేదాన్ని. మన ప్రమేయం లేని వాటి గురించి ఆలోచించి వేస్ట్ అని ఆవిడ చెప్పిన మాటలను మర్చిపోలేను.
* త్రివిక్రమ్‌తో ఎలా ఉంటారు?
– ఆయన దగ్గర తెలుగు బాగా నేర్చుకోవచ్చు. ఆయన అజ్ఞాతవాసి స్క్రిప్ట్ చెప్పినప్పుడు `కొంపదీసి అత్తారింటికి దారేదిలో ప్రణీత తరహా పాత్రా ఏంటి?` అని అడిగా. అబ్బే అలాంటిది కాదు. నీకు కీర్తితో సరిసమానంగా ప్రాముఖ్యత ఉంటుంది అని చెప్పారు. అప్పుడు అంగీకరించా. అల్లు అర్జున సరసన నటించే అవకాశం వచ్చింది కాబట్టి `గీతగోవిందం` వదిలేశా. అంతకు మించి వేరేం లేదు.
* మీ గత సినిమాలన్నీ ఆడకపోతే ఫీలయ్యారా?
– కీర్తికి కూడా మహానటిలాంటి సినిమా పడింది. నాక్కూడా అలాంటిది ఏదో ఒక రోజు పడుతుంది. శ్రుతిహాసన్‌కి కూడా ముందు హిట్ లేదు. ఆ తర్వాత ఒక్క హిట్ జీవితాన్ని మార్చేయలేదా.. అంతే. ఆ హిట్ కోసం చూడాల్సిందే.