ప్రభాస్.. శౌర్య.. శర్వా వెడ్ లాక్ పెండింగ్
కోవిడ్ విరామ సమయం ఒక్కొక్కరికి ఒక్కోలా కలిసొస్తోంది. ఉన్నట్టుండి టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ మనసు మార్చుకుని పెళ్లితో ఓ ఇంటి వాళ్లయిపోతున్నారు. నిఖిల్ .. నితిన్.. రానా .. ఇలా వరుసగా హీరోలంతా నచ్చిన మగువకు మనసిచ్చి అటుపై పెళ్లాడేశారు.
అయితే ఓ ముగ్గురు బ్యాచిలర్ హీరోల పెళ్లి సంగతే ఎటూ తేలడం లేదు. డార్లింగ్ ప్రభాస్ పెళ్లి కోసం పెదనాన్న కృష్ణం రాజు చాలా కాలంగా ఆత్రంగా వేచి చూస్తున్నారు. నేడో రేపో అబ్బాయ్ ఓకే చెప్పడమే ఆలస్యం .. వెంటనే పిల్లను చూసి పెళ్లి చేసేయాలని ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభాస్ ఏ విషయంలోనూ క్లారిటీ ఇవ్వడు. పెళ్లి అంటేనే అతడిలో ఏదో తెలీని డైలమా. ఇన్నాళ్లు కెరీర్ పరంగా సందిగ్ధత ఉందని అనుకున్నా.. ఇప్పుడు అలాంటిదేమీ లేదు. కెరీర్ విషయంలో ఓ క్లారిటీ వచ్చేసింది. పాన్ ఇండియా స్టార్ గా వెలుగుతున్నాడు.
ఇక నాగశౌర్య .. శర్వానంద్ సైతం ఇలాంటి డైలమాలోనే ఉన్నారు. శౌర్య అమ్మను ఎంతమాత్రం బాధ పెట్టకుండా టైమ్ చూసి పెళ్లాడేస్తానని అన్నాడు. కానీ దానికింకా టైముందిట. ఓ వైపు కెరీర్ బండిని సరైన రూట్ లో పెట్టాలన్న తపనతోనూ ఉన్నాడు. అయితే శర్వానంద్ మాత్రం ఇంకా పెళ్లి సంగతి ఎటూ తేల్చడం లేదు. అసలు శర్వా పెళ్లి మూడ్ లో ఉన్నట్టే కనిపించడు. ఇంకా కెరీర్ విషయమై ఏదైనా సాధించాలన్న తపనతోనే కనిపిస్తున్నాడు. అయితే కక్కోచ్చినా పెళ్లికి టైమొచ్చినా ఆగదనేది సామెత. ఆ ప్రకారమే వీళ్లంతా ఓ ఇంటివాళ్లయిపోతారన్నమాట. అప్పటివరకూ వెయిటింగ్ తప్పదు. సందీప్ కిషన్ సహా పలువురు బ్యాచిలర్ హీరోలకు పెళ్లి విషయమై క్లారిటీ రావాల్సి ఉందింకా.