విజయ్ దేవరకొండ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ‘హీరో’ అనే చిత్రాన్ని తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఆనంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. ఏప్రిల్ 22న న్యూడిల్లీలో చిత్రం షూటింగ్ ప్రారంభం కాబోతోందని మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. కానీ సినిమా ప్రారంభం కాకుండానే టైటిల్ వివాదంలో ఇరుక్కుందీ చిత్రం.
అదేమిటంటే..‘హీరో’ టైటిల్‌తో తమిళంలోనూ ఓ సినిమా రాబోతోంది. శివ కార్తికేయన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్. ఈ సినిమా షూటింగ్‌ను బుధవారం ప్రారంభించారు. విజయ్ ‘హీరో’.. అదే టైటిల్‌తో తమిళంలోనూ విడుదల కాబోతోంది. ఇప్పుడు శివ కార్తికేయన్ చిత్రానికి కూడా అదే టైటిట్ పెట్టడంతో సమస్య ఎదురైంది.
శివకార్తికేయన్ సినిమా యూనిట్ తమిళ నిర్మాతల మండలిలో టైటిల్ తాము రిజిస్టర్ చేసుకున్నట్టుగా సాక్ష్యాలను కూడా బయటపెట్టింది. షూటింగ్ ప్రారంభం కావటంతో ఆ సినిమానే ముందుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ పరిస్థితుల్లో విజయ్ తన సినిమా తమిళ వర్షన్ టైటిల్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అన్నది మాసక్తికరంగా మారింది.దీంతో ఎవరో ఒకరి సినిమాకు టైటిల్ మార్చాల్సిన పరిస్థితి. మరి ఏ చిత్ర యూనిట్ రాజీపడనుందో చూడాలంటున్నారు.