టెన్షన్ పుట్టించే టీజర్ ‘ఎవరు’ – రివ్యూ

టెన్షన్ పుట్టించే టీజర్ ‘ఎవరు’

విలక్షణ నటుడు, థ్రిల్లర్ కింగ్  అడివి శేష్ నటిస్తున్న మర్డర్ థ్రిల్లర్ ‘ఎవరు’ టీజర్ విడుదలైంది…హై క్లాస్ విజువల్స్ తో, రిచ్ టేకింగ్ తో పకడ్బందీ గా వున్న టీజర్ సినిమా పై విపరీతమైన ఆసక్తి రేపేలా వుంది. టీజర్ లో మొదటి కట్ లోనే పాయింటు చెప్పేశారు. హీరోయిన్ రేజీనాపై రేప్ అటెంప్ట్, ఒక్క పెట్టున గన్ పేలడం, హంతకురాలిగా రేజీనా దొరికిపోవడం…తమిళనాడు పోలీస్ ఇన్స్ పెక్టర్ విక్రం వాసుదేవ్ గా అడివి శేష్ ఎంట్రీ, కేసు దర్యాప్తు. ఆమె చేసింది హత్యా? ఆత్మ రక్షణా? కేసు ఎలా తేలింది? ఇదీ పాయింటు.

శ్రీచరణ్ పాకాల టెన్షన్ పుట్టించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ ని ఉలిక్కిపడి చూసేలా చేస్తోంది. ‘క్షణం’ తో హిట్ సస్పెన్స్ థ్రిల్లర్ నిచ్చిన అడివి శేష్, అదే పివిపి సంస్థతో ‘ఎవరు’ రూపొందిస్తున్నాడు. దర్శకుడు వెంకట్ రాంజీ. నవీన్ చంద్ర, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అబ్బూరి రవి మాటలు, వంశీ పచ్చిపులుసు కెమెరా. పివిపి సినిమా బ్యానర్ పై కెవిన్ ఏన్, పరమ్ వి. పోట్లూరి, పెర్ల్ వి పొట్లూరి నిర్మిస్తున్నారు.

ఆగస్టు 15న శర్వానంద్ నటించిన ‘రణరంగం’ విడుదలవుతోంది. అదే రోజు ‘ఎవరు’ విడుదల కాబోతోంది…ఈ లోగా ట్రైలర్ విడుదలవుతుంది. టీజర్ తోనే ఇంత ఉత్కంఠ రేపితే ట్రైలర్ ఇంకెంత గుబులు పుట్టిస్తుందో వెయిట్ చేసి చూద్దాం.