ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ రెడీ

‘బాహుబలి’ తర్వాత అంత రేంజ్ సక్సెస్ ప్రభాస్ కి ఇంకా రాలేదు. కానీ ప్రభాస్ క్రేజ్ మాత్రం అమాంతం పెరిగిపోయింది. తెలుగు లోనే కాకుండా మొత్తం ఇండియా అంత ప్రభాస్ సినిమా కోసం ఎదురుచూస్తుంది. ‘సాహో’, ‘రాధేశ్యామ్’ లాంటి డిజాస్టర్స్ తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న ‘ఆదిపురుష్’ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఆగష్టు లో రిలీజ్ అవ్వవలసిన సినిమా కొన్ని కారణాలవల్ల వాయిదాపడింది.

షూటింగ్ మొత్తం ఎప్పుడో కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా నుండి ఒక్క అప్డేట్ కూడా రాలేదు. ఇదే ప్రభాస్ ఫాన్స్ కి కొంచెం చిరాకు తెప్పించింది. అయితే ఇప్పుడు ఫిలిం టీం ప్రభాస్ ఫాన్స్ కి ఒక గుడ్ న్యూస్ తెచ్చింది. అక్టోబరు 2, 2022 న అయోధ్యలో ఆదిపురుష్ టీజర్‌ ను గ్రాండ్‌గా విడుదల చెయ్యడానికి అంత సిద్ధం అయ్యింది.

సరయు ఒడ్డున ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలా మంది అభిమానులు వస్తారు కాబట్టి, ప్రభాస్ మరియు అతని టీమ్ అందరికీ ఆహారం మరియు నీరు అందించేలా ఏర్పాట్లు చూసుకున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ లో ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటిస్తున్నారు ఆదిపురుష్ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.