అక్కినేని కుటుంబం నుండి హీరోలుగా ఎంతోమంది ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ నాగార్జున, నాగచైతన్య మాత్రం స్టార్ హీరోలుగా గుర్తింపు పొందారు. ఇక ఈ కుటుంబం నుండి నాగార్జున మేనకోడలు సుప్రియ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ సినిమా హిట్ అయినప్పటికీ సుప్రియ ఆ తర్వాత హీరోయిన్ గా కొనసాగాలని భావించలేదు. ఆ సినిమా తర్వాత చాలా కాలానికి గూఢాచారి సినిమాలో ఒక కీలక పాత్రలో నటించింది. దీంతో సినిమాలకు దూరమై ఇప్పుడు నిర్మాతగా మారింది. ఇక ఈ సినిమాలో నటించే సమయంలో హీరో అడవి శేషు తో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది.
ఇలా గూడచారి సినిమా ద్వారా పరిచయం అయిన వీరిద్దరూ ఆ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడినట్లు గతంలో వీరిద్దరి గురించి వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అప్పటినుండి వీరి రిలేషన్ గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఇక ఇటీవల వీరి రిలేషన్ గురించి వార్తలు మరొక సారి ఊపందుకున్నాయి. అందుకు కారణం అక్కినేని కుటుంబం క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో అడవి శేషు కనిపించడం. క్రిస్మస్ పండుగ సెలబ్రేషన్స్ సందర్భంగా అక్కినేని కుటుంబ సభ్యులు తీసుకున్న ఫోటోలు అడవి శేషు సుప్రియ పక్కనే ఉండటం ఈ వార్తలు వైరల్ అవ్వటానికి ముఖ్య కారణం.
ఇలా వీరిద్దరూ ఫోటోలో పక్కపక్కనే కనిపించడంతో వీరి మధ్య ఉన్న రిలేషన్ నిజమేనని.. తొందర్లోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీరిద్దరూ నిజంగా ప్రేమలో పడ్డారా..? మరి ఇంతకాలం పెళ్లి చేసుకోకుండా ఉండటానికి కారణం ఏమిటి అని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. నిజంగా వీరిద్దరూ రిలేషన్ లో ఉండి దానిని సీక్రెట్ గా ఉంచుతున్నారని కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా గతంలో సుప్రీతకి వివాహం జరిగి టీనేజ్ వయసున్న ఒక కూతురు ఉండటం వల్ల అడవి శేషు ఇంట్లో వీరి పెళ్లికి అంగీకరించడం లేదని మరొకవైపు వార్తలు వైరల్ అవుతున్నాయి. వీరి రిలేషన్ గురించి వస్తున్న వార్తలకు పులిస్టాప్ పడాలంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు కచ్చితంగా స్పందించాల్సి ఉంటుంది.