ఈ ఏడాదికి మాత్రం బాలీవుడ్ సినిమా పరిస్థితి అసలేం బాగోలేదని అందరికీ తెలిసిందే. వచ్చిన ప్రతి పెద్ద స్టార్ సినిమా కూడా డిజాస్టర్ గానే మిగిలిపోయింది. దీనితో అయితే అక్కడ ఏమాత్రం అక్కడ ఒక రోరింగ్ సక్సెస్ కోసం అంతా ఎదురు చూస్తుండగా ఇప్పుడు మాత్రం అంతా ఈ నెలలో రిలీజ్ కాబోతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “లైగర్” కోసం ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ చిత్రంలో బిజె దేవరకొండ బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటించింది. పూరి జగన్నాథ్ తెరకెక్కించాడు అలాగే బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ నిర్మాణం వహించాడు. ఇప్పుడు ఇదే ఈ సినిమాని చిక్కుల్లో పడేసే అంశగా మార్చినట్టుగా తెలుస్తుంది.
ఈ సినిమాని హిందీలోనే ఎక్కువగా తీసినట్టుగా ట్రైలర్ చూస్తే అర్ధం అయ్యిపోతుంది. మన దగ్గర అంటే పెద్దగా ఏమి కాదు కానీ ఇపుడు బాలీవుడ్ లో రచ్చ మాములుగా లేదు దీనితో ఈ సినిమాని కూడా అక్కడ బాయ్ కాట్ చేస్తారా అనేది ఆసక్తిగా మారింది.
ఈ చిత్రానికి ఇప్పటివరకు అయితే పెద్దగా ఎలాంటి సమస్య లేదు కానీ ఒకవేళ ఉండదు అని చెప్పడానికి కూడా లేదు. నిర్మాత కరణ్ జోహార్ పేరు ఒకటి చాలు లాస్ట్ మినిట్ లో అయినా సినిమాపై నెగిటివ్ ప్రచారం కావడానికి. మరి ఈ సినిమాకి అయితే చిత్ర బృందం ఎలాంటి స్టెప్స్ తీసుకొని ముందుకు వస్తాయేమో చూడాలి.