డార్లింగ్ ప్రభాస్ తన కెరీర్ లో తొలి 3డి మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ లాంటిదే. ఎందుకంటే తానాజీ లాంటి అద్భుతమైన 3డి విజువల్ వండర్ ని క్రియేట్ చేసిన ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండడం ఒకెత్తు అయితే.. టీసిరీస్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించనుండడం మరో ప్రధాన అస్సెట్ కానుంది. ఏ-ఆదిపురుష్ అనే టైటిల్ ని ప్రకటించేయడంతో ప్రభాస్ అభిమానుల్లో ఆనందం పరాకాష్టకు చేరుకుంది.
ఈ సినిమాని తెలుగు-హిందీ ద్విభాషా చిత్రంగా తెరకెక్కించి అటుపై దేశంలోని అన్ని భాషల్లో రిలీజ్ చేస్తారు. విదేశాల్లోనూ భారీగా రిలీజ్ చేయనున్నారు. అంటే ఇప్పటివరకూ ఇండస్ట్రీ లో ఉన్న అన్ని రికార్డుల్ని ఈ 3డి మూవీ తుడిచేసేందుకు ఆస్కారం ఉందని అంచనా వేస్తున్నారు. బాహుబలి 2- దంగల్ -పద్మావత్ సహా పలు చిత్రాలు నెలకొల్పిన రికార్డుల్ని ప్రభాస్ – ఓంరౌత్ మూవీ ఆదిపురుష్ బ్రేక్ చేస్తుందనే భావిస్తున్నారు.
అన్నట్టు ఈ మూవీకి ప్రభాస్ నే తొలి ఆప్షన్ గా దర్శకుడు భావించారా? అంటే.. అలాంటిదేమీ లేదు. తొలుత ఈ స్క్రిప్టును బాలీవుడ్ కండల హీరో హృతిక్ రోషన్ కి వినిపించాడు. కానీ అతడు కొంత సమయం ఇవ్వాల్సిందిగా డైలమాలో పెట్టేశాడు. ఆ తర్వాత వేరొక యువహీరోకి దర్శకుడు కథ వినిపించాడు. అతడితోనూ వర్కవుట్ కాలేదు. ఆ క్రమంలోనే సౌత్ లో పాన్ ఇండియా స్టార్ గా పాపులరైన ప్రభాస్ ని ఎంపిక చేసుకున్నాడు. డార్లింగ్ ఈ ప్రాజెక్టుకు సంతకం చేయడంతో జాక్ పాట్ కొట్టేశాడన్న చర్చా సాగుతోంది. ప్రభాస్ ని పాన్ వరల్డ్ స్టార్ గా ఆవిష్కరించేందుకు నాగ్ అశ్విన్- అశ్వనిదత్ బృందం ప్రయత్నిస్తుండగానే… ఆదిపురుష్ 3డి లాంటి క్రేజీ ఆఫర్ దక్కడం నిజంగానే లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ లాంటిదే. ఎందుకంటే ఇది ప్రభాస్ కెరీర్ లోనే మరపురాని చిత్రంగా నిలుస్తుందనడంలో సందేహమేం లేదు.