కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని మూత పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే సడలింపులు ఇస్తూ ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. వైరస్ తో కలిసి బ్రతాకాల్సిందేనని భారత్ డిసైడ్ అయిన నేపథ్యంలో ఆక్షంలు ఎత్తేస్తూ సాధారణ పరిస్థితులకు వచ్చేలా చర్యలు చేపడుతున్నారు. వైరస్ ని ఎదుర్కోవాలంటే సోషల్ డిస్టెన్స్, శానిటైజ్ చేసుకోవడం, బయటకు వెళ్లినప్పుడు మాస్కులు తప్పక ధరించి తగు జాగ్రత్తలు తీసుకోవడం ఒక్కటే మార్గమని తేలిపోయింది. ఇక అగ్రరాజ్యం అమ అమెరికాలో మరణ మృదంగం మ్రోగుతున్నా అక్కడి అధ్యక్షుడు కరోనాని పెద్దగా పట్టించుకోలేదు. లాక్ డౌన్ అన్ని చోట్లా, అంత కఠినంగా అమలు చేయలేదు.
అయితే థియేటర్లు షాపింగ్ మాల్స్ సహా రద్దీగా ఉండేవి మూతపడ్డాయి. తాజాగా పరిస్థితులు అదుపులోకి వస్తోన్న నేపథ్యంలో ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. ఇప్పటికే షాపింగ్స్ మాల్స్ లాంటివి అన్ లాక్ చేసారు. ఈ నేపథ్యంలో థియేటర్లను జూలై17 నుంచి ఓపెన్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే టెక్సాస్ లో కరోనా ప్రభావం ఆలస్యంగా మొదలైంది. దీంతో అక్కడ రెండు రోజుల ఆలస్యంగా థియేటర్లు ఓపెన్ చేయనున్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను అక్కడి ప్రభుత్వం సిద్దం చేస్తోంది. అయితే థియేటర్లు ఓపెన్ చేసినా ప్రస్తుత పరిస్థితుల్లో ఖాళీగా ఉండటం తప్ప! చేసేదేదిలేదు.
చాలా దేశాల్లో మినహాయిపులు ఇచ్చినప్పటికీ షూటింగ్ లు చేయాలంటే భయపడుతున్నారు. సినీ ప్రియులంతా ఓటీటీలకే పరిమితమవుతున్నారు. ఇంకొన్ని నెలల పాటు ఓ టీటీలదే హవా. తెలుగు రాష్ర్టాల్లో ఇప్పటికే షూటింగ్ చేసుకోమని ఇరు రాష్ర్టాలు అనుమతులిచ్చాయి. కానీ ఏ హీరో, దర్శక, నిర్మాత ముందుకు రావాడం లేదు. ఇక అమెరికాలో తెలుగు మార్కెట్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమాకు అమెరికా అతిపెద్ద బిజినెస్ మార్కెట్. హాలీవుడ్ సినిమాల తర్వాత అత్యంత ఆదరణ పొందేవి తెలుగు సినిమాలే. మరి తాజా పరిస్థితుల్లో థియేటర్లు ఓపెన్ చేసినా పాత సినిమాల్ని రీ రిలీజ్ చేసుకోవాల్సిందే.