బయిటే కాదు..సినిమా ప్రపంచంలోనూ రాజకీయాలు భీబత్సంగా నడుస్తూంటాయి. ముఖ్యంగా ఒకే సబ్జెక్టుని ఇద్దరు ముగ్గురు తెరకెక్కించాలనుకున్నప్పుడు ఏర్పడిన పోటీని తట్టుకోవాలంటే కాస్త గేమ్ ఆడాలి. మిగతావాళ్లను తప్పించాలి. ఇప్పుడు జయలలిత బయోపిక్ కు ఇదే పరిస్దితి ఏర్పడింది.
ఓ ప్రక్కన ప్రముఖ దర్శకుడు భారతిరాజా, మరో ప్రక్క ‘మదరాస పట్టణం’ ఫేమ్ విజయ్ జయలలిత జీవిత చరిత్రను తెరకెక్కించాలని తపనతో ఉన్నారు. ఇంకా చాలా మందికి ఈ ఆలోచన ఉన్నా ఇద్దరు ప్రముఖులు పోటీ పడుతున్నప్పుడు మధ్యలో మనమెందుకు దూరటం అని తప్పుకున్నారు.
కానీ దర్శకురాలు ప్రియదర్శిని మాత్రం ఓ అడుగు ముందుకు వేసారు. ప్రముఖ దర్శకుడు మురగదాస్ అండతో ఈ ఇద్దరు డైరక్టర్స్ కు కౌంటర్ ఇచ్చారు. తను అనుకుంటున్నటైటిల్ తో ఓ పోస్టర్ రెడీ చేసి ఈ చిత్ర టైటిల్ పోస్టర్‌ను నిన్న విడుదల చేశారు. సినిమాకు ‘ది ఐరన్ లేడీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్ మురుగదాస్ ఈ టైటిల్ పోస్టర్‌ను ట్విటర్ ద్వారా విడుదల చేశారు. ‘జయలలిత బయోపిక్‌కు సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రియదర్శిని, చిత్ర టీమ్ విజయం సాధించాలని ఆశిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. దాంతో ఇప్పుడు తమిళ సినీ వర్గాల్లో ఊహించని ఈ ట్విస్ట్ కు అంతా షాక్ అయ్యారు.
Extremely happy and excited to launch the Title poster of #Jayalalithaabiopic #THEIRONLADY I wish @priyadhaarshini and team for a grand success.. pic.twitter.com/4c87Xxks74
— A.R.Murugadoss (@ARMurugadoss) September 20, 2018