తెలుగు హీరోయిన్లకు పెద్దగా సినిమా అవకాశాలిచ్చి ప్రోత్సహించేది చాలా తక్కువ. లోకల్ గాళ్ల్ కి అవకాశాలిస్తే లేనిపోని సమస్యలు నెత్తిన వేసుకున్నట్లేనని కొందరు దర్శక, నిర్మాతలు భావించి అవకాశాలివ్వరన్నది పచ్చి వాస్తవం. దీంతో వచ్చిన అవకాశలతోనే తెలుగు హీరోయిన్లు సంతృప్తి పడాలి. అటుపై నెమ్మదిగా కెరీర్ ని బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అదంత ఈజీ కాదు. తెలుగు హీరోయిన్లు తెలుగు లో సక్సెస్ అయింది ఇప్పటివరకూ అయితే లేదు. పాత రోజుల్లో స్టార్ హీరోయిన్లగా సక్సెస్ అయి చలామణీ అయ్యారు గానీ..ఇప్పుడా ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. అందుకు కారణాలు అనేకం.
అలా టాలీవుడ్ లో కి హైదరాబాద్ కి చెందిన గాళ్స్ చాలా మంది మంది ఎంట్రీ ఇచ్చారు. కానీ సక్సెస్ అయింది చాలా తక్కువ. వాళ్లలో చెప్పుకోదగ్గ హీరోయిన్లు ముగ్గురు,నులుగురే ఉన్నారు. అందులో ఓ హీరోయిన్ ఆరంభంలోనే చెప్పుకోదగ్గ అవకాశాలు అందుకుంది. హీరోయిన్ గా మంచి పేరే వచ్చింది. చిన్న హీరోలకు సరైన నాయికగాను పేరు సంపాందించింది. ఆ క్రేజ్ తో అవకాశాలు బాగానే అందుకుంది. కానీ అమ్మడు ఒక్కసారిగా కనుమరుగై పోయింది. పరిశ్రమపై తీవ్ర విమర్శలు చేసింది. ఇండస్ర్టీలో నెపిటోయిజం ఉందని గొంతెత్తి రచ్చ చేసింది. కొందరిపై వ్యక్తిగత దూషణలకు దిగింది. దీంతో ఆ సొగసిరిని ఇండస్ర్టీ పూర్తిగా పక్కనబెట్టింది.
దీంతో అవకాశాలు లేకపోవడంతో తప్పుడు దారిల్లో వెళ్లినట్లు అప్పట్లో ప్రచారం సాగింది. ఎన్ ఆర్ ఐలు టార్గెట్ గానే అమ్మడు పలు ఎంటర్ టైన్ మెంట్ ప్రొగ్రామ్స్ లో పాల్గొంటుందని ప్రచారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఓ రాజకీయ పార్టీలోనూ కొన్నాళ్లు తిరిగింది. అయితే అధికారంలో లేని పార్టీ కావడంతో అక్కడ ఉపయోగం లేదని పార్టీకి గుడ్ బై చెప్పింది. ప్రస్తుతం మళ్లీ ఇండస్ర్టీ వైపే మళ్లీ అడుగులు వేస్తోంది. అయితే గతంలో అమ్మడి ప్రవర్తన కారణంగా ఎవరూ దరి చేరనివ్వలేదని తాజా సమాచారం. ఇండస్ర్టీ ఓసారి పక్కనబెడితే తిరిగి ఛాన్స్ ఇవ్వడం అన్నది అసాధ్యమే. మరి ఈ భామ విషయంలో సుసాధ్యమవుతుందేమో చూడాలి.