ప్రేమ, డేటింగ్ వార్తల మీద తమన్నా రియాక్షన్ !
గుజరాతీ బ్యూటీ తమన్నా చాలా కాలంగా దక్షిణాదిని ఉపేస్తోంది. విభిన్నమైన పాత్రల ద్వారా అగ్ర కథానాయకులతో జోడీ కడుతూ తన ప్రతిభను చూపుతోంది తమన్నా. అప్పుడప్పుడు కెరీర్ డేంజర్‌లో పడినా, ఏదోక సినిమాతో ట్రాక్‌పైకి లాక్కొస్తోంది. హిట్లు ఫట్లు లైట్‌గా తీసుకునే మెచ్యూరిటీకి వచ్చేసిన తమన్నా .. పెళ్లీడుకి వచ్చేసినట్టేనని చిత్రసీమలో అందరూ అనుకుంటున్నారు. కూతురికి మంచి సంబంధం వెతికే ప్రయత్నాలూ చేస్తోందట తమన్నాతల్లి. ప్రస్తుతం వరుడిని వెతికే ప్రయత్నాలూ జరుగుతున్నాయట.
లైఫ్ పార్టనర్‌గా ఎవరుండాలన్న విషయం కూడా అమ్మానాన్నలకే వదిలేసిందట తమన్నా! ఆమధ్య వచ్చిన ప్రేమ, డేటింగ్ వార్తలన్నీ వదంతులేనని కొట్టిపారేస్తోంది. ‘వెండితెరపై వెలుగులు విరజిమ్మే అందాలభామలపై ప్రేమ, డేటింగ్ అంటూ వార్తలనేవి మామూలుగా వస్తూనే ఉంటాయి. టాలీవుడ్, బాలీవుడ్ లో ఇవన్నీ సహజమే. అయితే నా విషయానికొస్తే మాత్రం.. నెవరినీ ప్రేమించలేదు. అదే జరిగితే, ముందుగా మీడియాకే చెబుతా’నంటూ స్టేట్‌మెంట్లు కట్ చేస్తోంది. ప్రస్తుతం మిల్కీబ్యూటీ విశాల్‌కు పెయిర్‌గా ‘పెట్రోమ్యాక్స్’ ప్రాజెక్టుతో బిజీగా మారింది.