రజినీకాంత్ సినిమా వస్తోంది అంటే చాలు భాషతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల వాళ్ళు చూసేందుకు ఒకప్పుడు ఎగబడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ప్రతి సినిమాతో కూడా బౌన్స్ బ్యాక్ అవుతాడు అని అనుకున్నప్పుడల్లా ఫ్యాన్స్ కు తలైవా నిరాశను మిగులుస్తున్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ చాలా కాలంగా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు జైలర్ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ అందుకుంటాడు అనేది అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోంది. దాదాపు 2010 రోబో తర్వాత ఆయనకు సరైన సక్సెస్ అయితే లేదు. అయితే ఇప్పుడు జైలర్ సినిమాకు ఊహించిన విధంగా కొన్ని షాక్స్ అయితే తగులుతున్నట్లుగా తెలుస్తోంది. సాధారణంగా రజనీకాంత్ ఏ సినిమా చేసిన కూడా తమిళనాడులో ఉదయం 4 గంటలకు స్పెషల్ షోలు పడాల్సిందే.
ఫ్యాన్స్ అందరు కూడా అర్ధరాత్రి నుంచే ఆ హడావిడిలో పాల్గొంటూ ఉంటారు. అయితే ఈసారి జైలర్ సినిమాకు అనుకున్నంత స్థాయిలో పాజిటివ్ బజ్ లేకపోవడంతో ఉదయం షోలు ప్రదర్శించే అవకాశం లేనట్లుగా కొన్ని కథనాలు అయితే వెలువడ్డాయి. అయితే వాటిపై స్పందించిన ఫ్యాన్స్ కొందరు తలైవా సినిమాకు స్పెషల్ షోలు లేకపోతే అసలు ఏమాత్రం ఊరుకోము అని సోషల్ మీడియాలో దండయాత్ర మొదలుపెట్టారు.
ఇక కొందరు అయితే జైలర్ చిత్ర నిర్మాణ సంస్థను కూడా సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇక వెంటనే ఫాన్స్ ను అయితే వారు శాంతింపచేసినట్లు సమాచారం. ఈ విషయంపై వెంటనే ఒక క్లారిటీ ఇస్తామని కూడా అన్నారు. కానీ అఫీషియల్ గా ఇంకా ఉదయం షోలకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు అని తెలుస్తోంది. ఇక జైలర్ సినిమాను ఆగస్టు 10వ తేదీన విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.