Thamanna: ప్రియుడి ఫోటోలను డిలీట్ చేసిన తమన్నా… బ్రేకప్ చెప్పుకొని విడిపోయారా?

Thamanna: సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు ఎంత తొందరగా ప్రేమలో పడతారు అంతే తొందరగా బ్రేకప్ చెప్పుకుంటూ ఉంటారు. ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు ప్రేమించుకొని విడిపోగా మరికొందరు పెళ్లిళ్లు చేసుకొని విడిపోయారు. తాజాగా ఈ జాబితాలోకి నటి తమన్న కూడా వస్తారని తెలుస్తోంది. గత రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ స్టార్ హీరోయిన్గా ఎంతో బిజీగా గడుపుతున్న తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలు వెబ్ సిరీస్లలో కూడా బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉండగా గత రెండు సంవత్సరాల క్రితం ఈమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో కలసి లస్ట్ స్టోరీస్ 2 అనే సిరీస్ లో నటించారు. ఇందులో వీరిద్దరూ చాలా బోల్డ్ పాత్రలలో కనిపించారు అయితే ఈ సిరీస్ షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడినట్టు తమన్నా తమ ప్రేమ గురించి బయటపెట్టారు. ఇలా తమ ప్రేమ విషయాన్ని తెలియజేయడంతో వీరిద్దరు బహిరంగంగా చట్టపట్టలేసుకొని తిరిగారు.

ఇక వెకేషన్ లోకి కూడా ఇద్దరూ కలిసి వెళ్లడంతో అందుకు సంబంధించిన ఫోటోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా తాజాగా తమన్నా ఇంస్టాగ్రామ్ వేదికగా తన ప్రియుడు విజయ్ వర్మతో కలిసి ఉన్నటువంటి ఫోటోలు అన్నింటినీ కూడా డిలీట్ చేశారు దీనితో ఒక్కసారిగా వీరి రిలేషన్ గురించి వార్తలు హల్చల్ చేస్తున్నాయి తమన్నా విజయ్ వర్మ ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారా అందుకే ఈమె తన సోషల్ మీడియాలో తన ప్రియుడుతో కలిసి ఉన్న ఫోటోలను డిలీట్ చేశారా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇలా తమ రిలేషన్ బ్రేకప్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ కూడా ఈ ఇద్దరు ఈ వార్తలపై ఎక్కడ స్పందించలేదు దీంతో మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయి. ఇక ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాలి అంటే ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సి ఉంది. ఇక ప్రస్తుతం తమన్న విజయ్ వర్మ ఇద్దరు కూడా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.