‘రోబో 2’  టెన్షన్ కన్నా వడివేలు తలనొప్పి ఎక్కువైందే

భారీ బడ్జెట్ తో రజనీతో రూపొందిస్తున్న రోబో సీక్వెల్ (2.0) రిలీజ్ హడావిడి,టెన్షన్ లో ఉన్నాడు దర్శకుడు శంకర్. ఎందుకంటే ఏ చిన్న విషయంలో తేడా కొట్టినా అన్ని కోట్లు బూడిదిలో పోసిన పన్నీరే. దాంతో టీజర్,  ఫస్ట్ లుక్ దగ్గర నుంచి ప్రతీ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుని దుకు వెళ్తున్నాడు శంకర్. ఆయనఆ పనిలో తలమునకలై ఉండగా ప్రముఖ తమిళ కమడియన్ వడివేలు ఆయనకో తలనొప్పిగా మారాడు.

దర్శకుడు శంకర్ తన కెరీర్ ప్రారంభ రోజుల్లో వడివేలు కెరీర్ ని పీక్స్ కు తీసుకు వెళ్లాడనేది కాదనలేని సత్యం. ప్రేమికుడు సినిమాలో అయితే వడివేలుకి హీరో కు ఇచ్చినంత ప్రయారిటీ ఇచ్చాడు. ఆ తర్వాత వడివేలు మీద నమ్మకంతో అతన్నే హీరోగా పెట్టి డ్యూయిల్ రోల్ తో ‘హింసై అరసన్ 23వ పులకేసి’తీస్తే పెద్ద హిట్టైంది. అయితే అదే వడివేలు ఇప్పుడు  శంకర్ మీద కేసులు పెడుతున్నాడు. గొడవలు పెట్టుకుంటున్నాడు.

వడివేలు చేసిన ‘హింసై అరసన్ 23వ పులకేసి’ కు సీక్వెల్ తీయాలని శంకర్-చింబుదేవన్ అనుకున్నారు. వడివేలుతో కి అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ప్రి ప్రొడక్షన్ పనులు కూడా బాగా ఖర్చు పెట్టి చేశారు. కానీ అంతా రెడీ చేసుకుని షూటింగ్ మొదలుపెడదామనుకునే సమయానికి వడివేలు దెబ్బ కొట్టాడు. తనకు స్క్రిప్టు నచ్చలేదని, తనని కావాలనే డీగ్రేడ్ చేసి చూపించేందుకు ప్లాన్ చేస్తున్నారని అందుకే  ఈ సినిమా చేయనన్నాడు.

వడివేలు ఇచ్చిన ఈ ట్విస్ట్ కు  శంకర్, చింబు దేవ‌న్‌లకు ఏం చేయాలో అర్దం కాలేదు. రకరకాలుగా ఒప్పించటానికి ప్రయత్నించినా వడివేలు…ఓకే చెయ్యలేదు. దాంతో   నిర్మాతల మండలిలో వడివేలు వల్ల తమకు రూ.9 కోట్ల నష్టం వాటిల్లిందని..ఆ మొత్తం అతడి నుంచి ఇప్పించాలని అడిగారు.

 నోటీసులు కు వడివేలు నుంచి స్పందన లేదు. దీంతో చివరికి వడివేలుకు రెడ్ కార్డు జారీ చేశారు. అతను ఏ సినిమాలోనూ నటించకుండా నిషేధం పడింది. వడివేలును ఏ సినిమాలోనూ పెట్టుకోకూడదని నిర్మాతలకు ఆదేశాలు జారీ చేశారు. ఏదైమైనా శంకర్ కు  పెద్ద తలనొప్పిగా మాత్రం తయారయ్యాడని తమిళ సిని వర్గాలు అంటున్నాయి.